![T20 WC 2022 AUS VS IRE: Australia Set 180 Runs Target - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/31/Untitled-2_0.jpg.webp?itok=NyAcEwjG)
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 31) ఆస్ట్రేలియా-ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా.. ఆఖర్లో మార్కస్ స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) బ్యాట్ ఝులిపించారు.
మిచెల్ మార్ష్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్ కార్తీ మూడు వికెట్లు పడగొట్టగా.. జాషువ లిటిల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మ్యాక్స్‌వెల్ 2, స్టార్క్, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో తమ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment