
టీ20 ప్రపంచకప్-2022లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన లిటిల్ రెండో బంతికి విలియమ్సన్, మూడో బంతికి నీషమ్, నాలుగో బంతికి శాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు.
తద్వారా తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన రెండో ఐరీష్ బౌలర్‌గా లిటిల్ రికార్డులకెక్కాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ బౌలర్ కుర్టిస్ కాంఫియర్ హాట్రిక్ వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఆరో బౌలర్‌గా లిటిల్ నిలిచాడు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో శ్రీలంకపై యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.
హాఫ్ సెంచరీతో చెలరేగిన విలియమ్సన్
ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ విలియమ్సన్ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అలెన్(32), మిచెల్(31) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో లిటిల్ మూడు, డెలానీ, అడైర్ తలా వికెట్ సాధించారు.
చదవండి: T20 WC 2022: 4 సెమీస్ బెర్తులు.. 9 జట్ల మధ్య పోటీ! ఆరోజే అసలు మ్యాచ్‌లు..
Comments
Please login to add a commentAdd a comment