Joshua Little
-
ఆరేసిన జాషువ లిటిల్.. జింబాబ్వేకు మరో షాకిచ్చిన ఐర్లాండ్
ఐర్లాండ్ జట్టు తమ కంటే కాస్త మెరుగైన జింబాబ్వేకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐరిష్ టీమ్.. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని తాజాగా ఆతిథ్య జట్టుకు మరో షాకిచ్చింది. వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జాషువ లిటిల్ ఆరు వికెట్లు (10-2-36-6) తీసి జింబాబ్వేను ఒంటిచేత్తో ఓడించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. లిటిల్ ధాటికి 42.5 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మసకద్జ (40), ర్యాన్ బర్ల్ (38), క్లైయివ్ మదాండే (33), ముజరబానీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిటిల్‌కు జతగా మార్క్ అడైర్ (1/23), క్రెయిగ్ యంగ్ (1/30), ఆండీ మెక్‌బ్రెయిన్ (1/34), హ్యారీ టెక్టార్ (1/5) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 40.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్టిస్ క్యాంఫర్ (66) అర్ధసెంచరీతో రాణించగా.. లోర్కాన్ టక్కర్ (28), మార్క్ అడైర్ (25 నాటౌట్), హ్యారీ టెక్టార్ (21) ఒ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్ మవుటా, ముజరబానీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగరవ, చివంగ తలో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 17న జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. -
అన్నదమ్ముల సవాల్.. శ్రీలంక కెప్టెన్ ఐపీఎల్ ఎంట్రీ! అతడు కూడా..
ఐపీఎల్-2023లో అన్నదమ్ముల మధ్య సవాల్‌కు సమయం అసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరించనుండగా.. లక్నోకు హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా సారధ్యం వహించనున్నాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో కృనాల్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక రాజస్తాన్‌పై అద్భుతవిజయం సాధించిన గుజరాత్.. అదే జోరును లక్నోపై కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ పేసర్, ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జాషువా లిటల్ దూరమయ్యాడు. తన జాతీయ జట్టు విధులు నిర్విర్తించేందుకు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ తలపడనుంది. మే 9 నుంచి మే 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. అనంతరం లిటిల్ మళ్లీ గుజరాత్ జట్టుతో కలవనున్నాడు. శ్రీలంక కెప్టెన్ ఐపీఎల్ ఎంట్రీ ఇక లిటిల్ స్థానంలో శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్ దసన్ షనకను తీసుకోవాలని గుజరాత్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత గడ్డపై అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న షనక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా అభినవ్ మనోహర్ స్ధానంలో సాయిసుదర్శన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మైర్స్ ఔట్.. డికాక్ ఇన్ మరోవైపు లక్నో కూడా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఓపెనర్ కైల్ మైర్స్ స్ధానంలో ప్రోటీస్ స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మైర్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో డికాక్ చోటు దక్కలేదు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో మైర్స్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మైర్స్‌ను పక్కన పెట్టి డికాక్‌ను తీసుకురావాలని లక్నో మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తుది జట్లు(అంచనా) గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, సాయిసుదర్శన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, దసన్ షనక గుజరాత్ టైటాన్స్ సబ్‌స్ట్యూట్స్: శుభమాన్ గిల్, మనోహర్,శ్రీకర్ భరత్, శివమ్ మావి, సాయి కిషోర్ లక్నో సూపర్ జెయింట్స్ డికాక్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), కృష్ణప్ప గౌతం, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్ చదవండి: IPL 2023: అందుకే అలా చేశా.. అతడు మా జట్టుకు దొరికిన నిజమైన ఆస్తి! అద్భుతాలు సృష్టిస్తాడు -
ఐపీఎల్.. వీళ్లకిదే తొలిసారి! తలపండినోళ్లకు తక్కువే! వాళ్లకు మాత్రం కోట్లు!
IPL 2023- Debutants: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో రారాజుగా వెలుగొందుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కలలు కంటారనడంలో సందేహం లేదు. ఒక్కసారి ఐపీఎల్లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. దశ తిరిగిపోతుందని ఇప్పటికే ఎంతో మంది ప్లేయర్లు నిరూపించారు కూడా! ఇక మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 సీజన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదహారవ సీజన్‌తో ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం! కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్. ఐపీఎల్ మినీ వేలం-2023లో ముంబై ఇండియన్స్ అతడి కోసం ఏకంగా 17 కోట్ల రూపాయలు వెచ్చించింది. భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసింది. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆసీస్ తరఫున ఆడిన 8 టీ20 మ్యాచ్‌లలో 173.75 స్ట్రైక్‌రేటుతో 139 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా గ్రీన్‌కు ఇదే తొలి ఐపీఎల్. గతేడాది దారుణ వైఫల్యంతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఆల్‌రౌండర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ పవర్ హిట్టర్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 20 టీ20లు ఆడి 372 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో విశ్వరూపం ప్రదర్శించిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ మూడు మ్యాచ్‌లలో 468 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి తనని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌కు మరి ఏ మేరకు ‘తిరిగి చెల్లిస్తాడో’ ఈ యువ బ్యాటర్. సికందర్ రజా పాకిస్తాన్ మూలాలున్న జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అతడి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 147.97 స్ట్రైక్‌రేటుతో 219 పరుగులు సాధించాడీ ఆల్‌రౌండర్. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను తిప్పలు పెడుతూ 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వే తరఫున ఇప్పటి వరకు 66 టీ20లు ఆడి.. 1259 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో గతేడాది మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రజాను 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 36 ఏళ్ల ఈ వెటరన్ ఆల్‌రౌండర్ తన తొలి ఐపీఎల్ ఎడిషన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి! ముకేశ్ కుమార్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్. 29 ఏళ్ల ముకేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఆడిన 35 మ్యాచ్‌లలో 134 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 7.20 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రంజీ ట్రోఫీ-2021-22 సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో 20 వికెట్లు తీసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. విజయ్ హజారే ట్రోఫీ-2022లో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటిన ముకేశ్ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. తొలి సీజన్లోనే భారీ మొత్తం పలికిన ముకేశ్ కుమార్ ఢిల్లీ యాజమాన్యం నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడో మరి! జాషువా లిటిల్ ఐరిష్ పేసర్ జాషువా లిటిల్ అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. తన పదునైన పేస్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించే లిటిల్ తొలిసారి ఐపీఎల్లో పాల్గొనబోతున్నాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఐర్లాండ్ తరఫున ఆడిన 26 టీ20లలో 39 వికెట్లు తీశాడు. గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిశాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా ఏడు మ్యాచ్‌లలో 7 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్న 23 ఏళ్ల లిటిల్ను గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వీరు సైతం ఇక ఈ ఐదుగురితో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి, అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం కలిగిన 32 ఏళ్ల జో రూట్(రాజస్తాన్ రాయల్స్- ధర. కోటి), న్యూజిలాండ్ బ్యాటర్, 32 ఏళ్ల మైకేల్ బ్రేస్‌వెల్(ఆర్సీబీ- ధర కోటి) కూడా ఐపీఎల్ పదహారో ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: Cristiano Ronaldo: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా? రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్ క్యాప్ సన్‌రైజర్స్ బ్యాటర్‌కే! కచ్చితంగా అతడే.. -
గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం!
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీవేలంలో లిటిల్ను రూ.4.4 కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లిటిల్ మోకాలి గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతడు పీఎస్ఎల్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2022లో లిటిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో లిటిల్ కూడా రాణించాడు. చదవండి: ENG vs NZ: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
IPL 2023: నేనో అంతర్జాతీయ క్రికెటర్‌ను.. సీఎస్కే నాకు కనీస విలువ ఇవ్వలేదు..!
Joshua Little Sensational Comments On CSK: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై ఐర్లాండ్ స్టార్ పేసర్ జాషువ లిటిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన సీఎస్కే తన పట్ల అమర్యాదగా వ్యవహరించిందని వాపోయాడు. గత ఐపీఎల్ సీజన్ (2022) మధ్యలో సీఎస్కే నెట్ బౌలర్‌గా ఎంపికైన తనను.. జట్టు యాజమాన్యం సరిగ్గా ట్రీట్ చేయలేదని, తానొక అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి కనీస మర్యాద కూడా ఇవ్వలేదని తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. సీఎస్కే యాజమాన్యం తనకు చెప్పిందొకటి, వేల కిలోమీటర్లు దాటి వచ్చాక తన పట్ల ప్రవర్తించిన తీరు మరొకటి అంటూ బాధపడ్డాడు. సీఎస్కే మేనేజ్మెంట్ తనకు తుది జట్టులో అవకాశం కల్పిస్తామని (ఎవరైనా గాయపడితే) చెప్పి, అలా చేయకపోగా, కనీసం నెట్ బౌలర్‌గా కూడా వినియోగించుకోలేదని బాధను వెల్లగక్కాడు. ఐపీఎల్ ఆడేందుకు సుదూరం నుంచి వచ్చిన తనకు ట్రయినింగ్ సెషన్స్‌లో కూడా పూర్తిగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు. అప్పటికే లంక ప్రీమియర్ లీగ్, టీ10 లీగ్‌లో ఆడి, జాతీయ జట్టు తరఫున సత్తా చాటిన తన పట్ల సీఎస్కే యాజమాన్యం ప్రవర్తించిన తీరు చాలా బాధించిందని, అందుకే సీజన్ మధ్యలోనే (రెండు వారాల వ్యవధిలోనే) సీఎస్కే నుంచి వైదొలిగానని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 మినీ వేలం రేపు జరుగనున్న నేపథ్యంలో జాషువ లిటిల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022లో ఐర్లాండ్ జట్టు సంచలన ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ దశలో స్కాట్లాండ్, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించిన ఆ జట్టు.. సూపర్-12లో వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరింపించి (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) పెను సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్లు బట్లర్, హేల్స్‌ను పెవిలియన్‌కు పంపిన ఐరిష్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జాషువ లిటిల్.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ సాధించి ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిలో రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ టోర్నీలో 17.18 సగటున 11 వికెట్లు పడగొట్టిన లిటిల్.. రేపు జరుగబోయే ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. ప్రపంచ రికార్డుకు చేరువలో భువనేశ్వర్
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. నవంబర్ 18న వెల్లంగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో మరో నాలుగు వికెట్లు భువీ సాధిస్తే ఒక క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఐర్లాండ్ సంచలన బౌలర్ జోషువా లిటిల్ పేరిట ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు ఆడిన లిటిల్ 39 వికెట్లు పడగొట్టాడు. ఇక భువీ విషయానికి వస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు సాధించాడు. అదే విధంగా మరో అరుదైన రికార్డుకు కూడా చేరువలో భువీ ఉన్నాడు. ఈ సిరీస్‌లో 11 వికెట్లు భువీ సాధిస్తే.. టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కతాడు. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: T20 WC 2022: 'అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగేది'.. పాకిస్తాన్ దిగ్గజం సంచలన వాఖ్యలు! -
ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు వీళ్లే..!
టీ20 వరల్డ్‌కప్-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు, సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నట్లు సమాచారం. అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్‌లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
NZ Vs IRE: హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐర్లాండ్ బౌలర్..
టీ20 ప్రపంచకప్-2022లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన లిటిల్ రెండో బంతికి విలియమ్సన్, మూడో బంతికి నీషమ్, నాలుగో బంతికి శాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు. తద్వారా తన కెరీర్లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన రెండో ఐరీష్ బౌలర్‌గా లిటిల్ రికార్డులకెక్కాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ బౌలర్ కుర్టిస్ కాంఫియర్ హాట్రిక్ వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఆరో బౌలర్‌గా లిటిల్ నిలిచాడు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో శ్రీలంకపై యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగిన విలియమ్సన్ ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ విలియమ్సన్ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అలెన్(32), మిచెల్(31) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో లిటిల్ మూడు, డెలానీ, అడైర్ తలా వికెట్ సాధించారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: 4 సెమీస్ బెర్తులు.. 9 జట్ల మధ్య పోటీ! ఆరోజే అసలు మ్యాచ్‌లు.. -
WC 2022: ఐరిష్ బౌలర్ సంచలనం.. ప్రపంచ రికార్డు! భువీని వెనక్కి నెట్టి
T20 World Cup 2022- New Zealand vs Ireland- Joshua Little: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐరిష్ బౌలర్ జోషువా లిటిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా కివీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన ఈ 23 ఏళ్ల పేసర్.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు లిటిల్ 39 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ గ్రూప్-1 సూపర్-12లో భాగంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ వికెట్లు తీసి ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ సీమర్ భువనేశ్వర్ కుమార్‌ను వెనక్కి నెట్టడం గమనార్హం. కాగా అడిలైడ్ వేదికగా న్యూజిలాండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో 19వ ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేసిన జోషువా లిటిల్.. మొత్తంగా తన కోటా పూర్తి చేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరోవైపు.. మార్క్ అడేర్ ఒకటి, డెలని రెండు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్లు(ఇప్పటి వరకు) ►జోషువా లిటిల్(ఐర్లాండ్)- 39 (2022) ►సందీప్ లమిచానే(నేపాల్)- 38 (2022) ►వనిందు హసరంగ(శ్రీలంక)- 36 (2021) ►తబ్రేజ్ షంసీ(సౌతాఫ్రికా)- 36 (2021) ►దినేశ్ నకార్ని(ఉగాండా)- 35 (2021) ►భువనేశ్వర్ కుమార్(ఇండియా)- 35 (2022) చదవండి: ఐసీసీ భారత్‌కు సపోర్ట్ చేస్తోంది.. వారికి ఉత్తమ అంపైర్ అవార్డులు ఇవ్వాలంటూ పాక్ మాజీ ప్లేయర్ అక్కసు T20 WC 2022: 4 సెమీస్ బెర్తులు.. 9 జట్ల మధ్య పోటీ! ఆరోజే అసలు మ్యాచ్‌లు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం
Ireland vs Afghanistan, 5th T20I: సీమర్లు మార్క్ అడైర్ (3/16), జాషువ లిటిల్ (2/14) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని పర్యాటక జట్టుకు భారీ షాకిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 15 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా భారీ వర్షం కురువడంతో ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపేసిన అంపైర్లు.. ఆ తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌కు 7 ఓవర్లలో 56 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఐర్లాండ్ 3 వికెట్లు కోల్పోయి మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఘని (40 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు కూడా తడబడినప్పటికీ లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ విజయం సాధించారు. పాల్ స్టిర్లింగ్ (10 బంతులో 16), లోర్కన్ టక్కర్ (12 బంతుల్లో 14) రెండంకెల స్కోర్లు సాధించగా.. హ్యారీ టెక్టార్ (5 బంతుల్లో 9), జార్జ్ డాక్రెల్ (4 బంతుల్లో 7) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ గెలుపొందగా.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను డిసైడర్ దాకా తీసుకువచ్చింది. చదవండి: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ -
IPL 2022: బంపరాఫర్ కొట్టేసిన ఐర్లాండ్ పేసర్.. సీఎస్కే తరఫున..
ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్‌కు బంపరాఫర్ దక్కింది. ఐపీఎల్లో భాగమయ్యే ఛాన్స్ కొట్టేశాడు. క్రికెట్ ఐర్లాండ్ సమాచారం ప్రకారం.. లిటిల్ చెన్నై సూపర్‌కింగ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లిటిల్‌కు శుభాభినందనలు తెలిపిన క్రికెట్ ఐర్లాండ్... ‘‘ఐపీఎల్ ఆరంభం మ్యాచ్‌లలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో మమేకమయ్యే అవకాశం దక్కించుకున్నందుకు కంగ్రాట్స్! సీఎస్కే నెట్ బౌలర్‌గా ఉండటం అద్భుత అవకాశం’’ అని ట్వీట్ చేసింది. కాగా జాషువా లిటిల్ 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. హాంకాంగ్‌తో టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల ఈ 22 ఏళ్ల పేసర్.. పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 31 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 34 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్లో ధోని సారథ్యంలో మెళకువలు నేర్చుకునే అవకాశం దక్కించుకున్నాడు. కాగా మార్చి 26 నుంచి ఆరంభం కానున్న క్యాష్ రిచ్ లీగ్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సీఎస్కే, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. చదవండి: 'జడేజా ఇన్నింగ్స్ అంత గొప్పదేం కాదు.. దమ్ముంటే అక్కడ ఆడి చూపించాలి' IPL 2022: సింగమ్స్ ఇన్ సూరత్.. అప్పుడే రంగంలోని దిగిన ధోని అండ్ కో 👏👏👏 Congrats to Josh Little who is heading off on a development opportunity with the Chennai Super Kings in the early stages of the upcoming IPL. The experience as a net bowler for CSK should be fantastic. #GoWellJosh ☘️🏏 pic.twitter.com/5aUFwfZkAp — Cricket Ireland (@cricketireland) March 7, 2022 𝐴𝑏ℎ𝑎𝑟𝑎 Surat! Those eyes that smile with 💛 give us the joy, everywhere we go! #SingamsInSurat #WhistlePodu 🦁 pic.twitter.com/T8xwHjoqeI — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022