WC 2022: ఐరిష్‌ బౌలర్‌ సంచలనం.. ప్రపంచ రికార్డు! భువీని వెనక్కి నెట్టి | T20 WC 2022 NZ Vs IRE: Joshua Little World Record In T20Is Check | Sakshi
Sakshi News home page

NZ Vs IRE: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఐరిష్‌ బౌలర్‌! భువీని సైతం వెనక్కి నెట్టి

Published Fri, Nov 4 2022 11:52 AM | Last Updated on Fri, Nov 4 2022 12:22 PM

T20 WC 2022 NZ Vs IRE: Joshua Little World Record In T20Is Check - Sakshi

జోషువా లిటిల్‌ (PC: Cricket Ireland Twitter)

T20 World Cup 2022- New Zealand vs Ireland- Joshua Little: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐరిష్‌ బౌలర్‌ జోషువా లిటిల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా కివీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన ఈ 23 ఏళ్ల పేసర్‌.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20లలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు లిటిల్‌ 39 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌ గ్రూప్‌-1 సూపర్‌-12లో భాగంగా కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ వికెట్లు తీసి ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను వెనక్కి నెట్టడం గమనార్హం. 

కాగా అడిలైడ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో 19వ ఓవర్లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన జోషువా లిటిల్‌.. మొత్తంగా తన కోటా పూర్తి చేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరోవైపు.. మార్క్‌ అడేర్‌ ఒకటి, డెలని రెండు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  

క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్లు(ఇప్పటి వరకు)
►జోషువా లిటిల్‌(ఐర్లాండ్‌)- 39 (2022)
►సందీప్‌ లమిచానే(నేపాల్‌)- 38 (2022)
►వనిందు హసరంగ(శ్రీలంక)- 36 (2021)
►తబ్రేజ్‌ షంసీ(సౌతాఫ్రికా)- 36 (2021)
►దినేశ్‌ నకార్ని(ఉగాండా)- 35 (2021)
►భువనేశ్వర్‌ కుమార్‌(ఇండియా)- 35 (2022)

చదవండి: ఐసీసీ భారత్‌కు సపోర్ట్‌ చేస్తోంది.. వారికి ఉత్తమ అంపైర్‌ అవార్డులు ఇవ్వాలంటూ పాక్‌ మాజీ ప్లేయర్‌ అక్కసు
T20 WC 2022: 4 సెమీస్‌ బెర్తులు.. 9 జట్ల మధ్య పోటీ! ఆరోజే అసలు మ్యాచ్‌లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement