కేన్ విలియమ్సన్ (PC: ICC Twitter)
ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Pakistan, 1st Semi-Final: ‘‘ఆరంభంలోనే వాళ్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. వికెట్ కాస్త కఠినంగానే ఉంది. పాకిస్తాన్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసింది. మిచెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో మమ్మల్ని తిరిగి పుంజుకునేలా చేశాడు. ఇంకాస్త మెరుగైన స్కోరు నమోదు చేస్తామనే భావించాం. కానీ పాకిస్తాన్‌ను ఎదుర్కోలేకపోయాం’’ అని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ విచారం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సెమీస్ వరకు చేరుకోగలిగిన కివీస్.. అసలైన మ్యాచ్‌లో చేతులెత్తేసిన విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది గతేడాది రన్నరప్‌గా నిలిచిన బ్లాక్ క్యాప్స్.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కివీస్ సారథి కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘వాళ్లు నిజంగా అత్యద్భుతంగా ఆడారు. బాబర్, రిజ్వాన్ ఈ ఇద్దరూ మమ్మల్ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. ఈ మ్యాచ్‌లో మా ఆట అస్సలు బాగాలేదు.
ఏదేమైనా ఈ విజయానికి వాళ్లు అర్హులు. టోర్నీ ఆసాంతం బాగా ఆడిన మేము.. కీలక మ్యాచ్‌లో మాత్రం మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా!’’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ 53 పరుగులతో అజేయంగా నిలవగా.. విలియమ్సన్ 46 పరుగులు సాధించాడు. అయితే, బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లాకీ ఫెర్గూసన్ అత్యధికంగా నాలుగు ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన పాకిస్తాన్ ఈ ఎడిషన్‌లో ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఇక మరో బెర్తు కోసం గురువారం నాటి రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తలపడనున్నాయి.
చదవండి: 'బ్లాక్‌క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం
PAK Vs NZ: ఫామ్ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత
Comments
Please login to add a commentAdd a comment