IPL 2023: Irish Bowler Josh Little Sensational Comments On CSK, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2023: చెన్నై సూపర్‌ కింగ్స్‌పై వరల్డ్‌కప్‌ హ్యాట్రిక్‌ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Dec 22 2022 9:04 PM | Last Updated on Fri, Dec 23 2022 6:42 PM

IPL 2023: Irish Bowler Josh Little Sensational Comments On CSK - Sakshi

Joshua Little Sensational Comments On CSK: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)పై ఐర్లాండ్‌ స్టార్‌ పేసర్‌ జాషువ లిటిల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ అయిన సీఎస్‌కే తన పట్ల అమర్యాదగా వ్యవహరించిందని వాపోయాడు.  గత ఐపీఎల్‌ సీజన్‌ (2022) మధ్యలో సీఎస్‌కే నెట్‌ బౌలర్‌గా ఎంపికైన తనను.. జట్టు యాజమాన్యం సరిగ్గా ట్రీట్‌ చేయలేదని, తానొక అంతర్జాతీయ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి కనీస మర్యాద కూడా ఇవ్వలేదని తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. 

సీఎస్‌కే యాజమాన్యం తనకు చెప్పిందొకటి, వేల కిలోమీటర్లు దాటి వచ్చాక తన పట్ల ప్రవర్తించిన తీరు మరొకటి అంటూ బాధపడ్డాడు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ తనకు తుది జట్టులో అవకాశం ‍కల్పిస్తామని (ఎవరైనా గాయపడితే) చెప్పి, అలా చేయకపోగా, కనీసం నెట్‌ బౌలర్‌గా కూడా వినియోగించుకోలేదని బాధను వెల్లగక్కాడు. ఐపీఎల్‌ ఆడేందుకు సుదూరం నుంచి వచ్చిన తనకు ట్రయినింగ్‌ సెషన్స్‌లో ​కూడా పూర్తిగా బౌలింగ్‌ చేసే అవకాశం ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు.

అప్పటికే లం‍క ప్రీమియర్‌ లీగ్‌, టీ10 లీగ్‌లో ఆడి, జాతీయ జట్టు తరఫున సత్తా చాటిన తన పట్ల సీఎస్‌కే యాజమాన్యం ప్రవర్తించిన తీరు చాలా బాధించిందని, అందుకే సీజన్‌ మధ్యలోనే (రెండు వారాల వ్యవధిలోనే) సీఎస్‌కే నుంచి వైదొలిగానని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2023 మినీ వేలం రేపు జరుగనున్న నేపథ్యంలో జాషువ లిటిల్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఐర్లాండ్‌ జట్టు సంచలన ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్‌ దశలో స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించిన ఆ జట్టు.. సూపర్‌-12లో వరల్డ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరింపించి (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) పెను సంచలనం సృష్టించింది.

ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విధ్వంసకర ఓపెనర్లు బట్లర్‌, హేల్స్‌ను పెవిలియన్‌కు పంపిన ఐరిష్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జాషువ లిటిల్‌.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్‌ సాధించి ప్రపంచ క్రికెట్‌ అభిమానుల దృష్టిలో రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ టోర్నీలో 17.18 సగటున 11 వికెట్లు పడగొట్టిన లిటిల్‌.. రేపు జరుగబోయే ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement