
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్‌లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీవేలంలో లిటిల్‌ను రూ.4.4 కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లిటిల్ మోకాలి గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతడు పీఎస్‌ఎల్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అతడు మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2022లో లిటిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో లిటిల్ కూడా రాణించాడు.
చదవండి: ENG vs NZ: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment