ఐర్లాండ్ జట్టు తమ కంటే కాస్త మెరుగైన జింబాబ్వేకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐరిష్ టీమ్.. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని తాజాగా ఆతిథ్య జట్టుకు మరో షాకిచ్చింది. వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జాషువ లిటిల్ ఆరు వికెట్లు (10-2-36-6) తీసి జింబాబ్వేను ఒంటిచేత్తో ఓడించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. లిటిల్ ధాటికి 42.5 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మసకద్జ (40), ర్యాన్ బర్ల్ (38), క్లైయివ్ మదాండే (33), ముజరబానీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిటిల్‌కు జతగా మార్క్ అడైర్ (1/23), క్రెయిగ్ యంగ్ (1/30), ఆండీ మెక్‌బ్రెయిన్ (1/34), హ్యారీ టెక్టార్ (1/5) రాణించారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 40.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్టిస్ క్యాంఫర్ (66) అర్ధసెంచరీతో రాణించగా.. లోర్కాన్ టక్కర్ (28), మార్క్ అడైర్ (25 నాటౌట్), హ్యారీ టెక్టార్ (21) ఒ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్ మవుటా, ముజరబానీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగరవ, చివంగ తలో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 17న జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment