న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. నవంబర్ 18న వెల్లంగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో మరో నాలుగు వికెట్లు భువీ సాధిస్తే ఒక క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు.
ప్రస్తుతం ఈ రికార్డు ఐర్లాండ్ సంచలన బౌలర్ జోషువా లిటిల్ పేరిట ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు ఆడిన లిటిల్ 39 వికెట్లు పడగొట్టాడు. ఇక భువీ విషయానికి వస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు సాధించాడు. అదే విధంగా మరో అరుదైన రికార్డుకు కూడా చేరువలో భువీ ఉన్నాడు. ఈ సిరీస్‌లో 11 వికెట్లు భువీ సాధిస్తే.. టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కతాడు.
న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు..
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: T20 WC 2022: 'అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగేది'.. పాకిస్తాన్ దిగ్గజం సంచలన వాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment