
బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం-2022 రెండో రోజు ఆరంభమైంది. తొలిసెట్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్కరమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. 2.6 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. టీమిండియా సీనియర్, టెస్టు ప్లేయర్ అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కోటి రూపాయలు ఖర్చు చేసి అతడిని సొంతం చేసుకుంది.
ఇక మన్‌దీప్ సింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.... తొలి సెట్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, టీ20 ప్రపంచకప్ విజేత-2021 ఆస్ట్రేలియా సారథి ఆరోన్ ఫించ్ సహా పలువురు ఆటగాళ్లు అన్‌సోల్డ్(ఎవరూ కొనలేదు)గా మిగిలిపోయారు. ఫ్రాంఛైజీలు వీరిని అసలు పట్టించుకోలేదు.
ఐపీఎల్ మెగా వేలం-2022: రెండో రోజు తొలి సెట్- అన్‌సోల్డ్ జాబితా:
1. డేవిడ్ మలన్(ఇంగ్లండ్)
2. మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా)
3. ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్)
4. సౌరభ్ తివారి(ఇండియా)
5. ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)
6. ఛతేశ్వర్ పుజారా(ఇండియా)
చదవండి: IPL 2022 Auction Unsold Players: అమ్ముడుపోని ఆటగాళ్లకు మరో చాన్స్ .. అదేంటంటే