
PC: Inside sport
కాన్‌బెర్రా వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్.. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 6.2 ఓవర్ల వద్ద ఉండగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
అనంతరం వర్షం తగ్గుముఖం పట్టడడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. మళ్లీ 9.4 ఓవర్ల వద్ద వర్షం తిరిగి రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అనంతరం మ్యాచ్‌ను మళ్లీ 12 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(65 నాటౌట్) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆస్ట్రేలియా విజయం లక్ష్యం 12 ఓవర్లలో 130 పరుగులగా నిర్ణయించారు. ఇక ఆసీస్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం మ్యాచ్‌కు అడ్డుపడింది. అయితే ఈ సారి మాత్రం భారీ వర్షం రావడంతో అఖరికి మ్యాచ్‌ను రద్దు చేశారు.
చదవండి: Jasprit Bumrah Replacement: బుమ్రా స్థానంలో వరల్డ్‌కప్ ఆడేది అతడే: బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment