
లండన్: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్వల్ప వ్యవధిలోనే తనదైన ముద్ర వేయగలిగాడు. ఎంతలా అంటే.. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ చుట్టూ తిరిగే ఎనిమిదేళ్ల బాలికల్లాగా.. తాము కూడా పాంటింగ్‌పై ఆరాధన కలిగి ఉన్నామని కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెబుతున్నంతగా! ‘డ్రెస్సింగ్ రూమ్‌లో ‘పంటర్(పాంటింగ్)ఉంటే మేమంతా అతడి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంటాం.
ఓ రకంగా బీబర్ చుట్టూ తిరిగే ఎనిమిదేళ్ల పిల్లల్లా మారిపోతాం. ఆసీస్ విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న పాంటింగ్ సలహాలు మాకు ఉపయోగపడతాయి’ అని ఫించ్ తెలిపాడు. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండు వరుస వరల్డ్‌కప్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. 2003, 07 సంవత్సరాల్లో పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ వరల్డ్‌కప్‌ను అందుకుంది. మే 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతోంది. ఈసారి కూడా టైటిల్ గెలిచి తమ వరల్డ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలనే కసితో ఉంది ఆసీస్.