
ఆరోన్ ఫించ్(ఫైల్ ఫోటో)
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని ఫించ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కెయిర్న్స్ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 11) న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డే ఫించ్‌కు అఖరి వన్డే కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు (శనివారం) ఫించ్‌విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సమావేశంలో ఫించ్ తన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా కెప్టెన్‌గా జట్టును విజయాల బాటలో నడిపిస్తున్న ఫించ్.. వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం దారుణంగా విఫలమవతున్నాడు.
ఫించ్ గత తన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు తమ తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్-2021ను ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: Asia Cup 2022: కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు!