సిడ్నీ : మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న మెగా ఈవెంట్ ప్రపంచకప్-2019కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఆస్ట్రేలియా సెలక్టర్ల చైర్మన్ ట్రెవర్ హాన్స్ సోమవారం తెలిపారు. ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు జోష్ హజల్‌వుడ్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్‌స్కోంబ్‌లకు చోటు దక్కలేదు. దీంతో అలెక్స్ కారె వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగానే హజల్‌వుడ్ జట్టులో చోటుదక్కలేదని, యాషెస్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని ట్రెవర్ స్పష్టం చేశాడు. ఇక బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది పాటు ఆటకు దూరమైన స్టీవ్‌స్మిత్, డెవిడ్ వార్నర్‌లు వరల్డ్‌కప్ జట్టులో చోటుదక్కించుకున్నారు. కానీ ఆరోన్ ఫించ్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు.
BREAKING: Australia name their #CWC19 squad! pic.twitter.com/jmz7KhPKxA
— Cricket World Cup (@cricketworldcup) 15 April 2019
తుది జట్టు:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్‌వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్‌స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారె(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నీల్, రిచర్డ్సన్, జాసన్ బెహండ్రాఫ్, ఆడమ్ జంపా.
Comments
Please login to add a commentAdd a comment