ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో ఫాఫ్ డుప్లెసిస్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, గతంలో ఆర్సీబీకి ఆడిన ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ వైఫల్యాలకు కారణాలు ఇవేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘‘వేలం సమయంలోనే వారు తప్పటడుగు వేసినట్లు కనిపించింది. బ్యాటర్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టారు గానీ బౌలింగ్ విభాగంపై పెద్దగా దృష్టి సారించలేదు.
ముఖ్యంగా ఈ జట్టులో ఒక్క వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ కూడా లేడు. ఈ విషయంలో కేకేఆర్ పూర్తిగా విజయవంతమైంది. వాళ్లకు సునిల్ నరైన్ రూపంలో ప్రపంచస్థాయి స్పిన్ బౌలర్ దొరికాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పేయగలడు.
ఆర్సీబీకి మాత్రం ఇలాంటి స్పిన్నర్ లేడు. మరో విషయం ఏమిటంటే.. వాళ్లు పెద్ద మొత్తం వెచ్చించి ఎంతో మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. వారిలో కామెరాన్ గ్రీన్ కూడా ఒకడు.
అతడికి చెల్లించే జీతం భారీ మొత్తంలో ఉంటుంది. అలాంటపుడు సేవలను ఉపయోగించుకోవడంలోనూ తెలివిగా వ్యవహరించాలి కదా! నిజానికి మిడిలార్డర్‌లో కంటే టాపార్డర్‌లోనే గ్రీన్ మెరుగ్గా రాణించగలడు.
కానీ అతడిని మిడిలార్డర్‌లోనే పంపిస్తున్నారు. తనకు సౌకర్యంగా లేని స్థానంలో వెళ్లి బ్యాటింగ్ చేయమని చెప్తే ఏ ఆటగాడైనా ఏం చేయగలడు. కచ్చితంగా ఇబ్బంది పడతాడు కదా’’ అని ఆరోన్ ఫించ్ ఆర్సీబీ నిరాశజనక ప్రదర్శనకు ఈ రెండూ కారణం కావొచ్చని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చాడు.
కాగా ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ కోసం ఆర్సీబీ రూ. 17.50 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అయితే, టాపార్డర్‌లో పవర్‌ఫుల్ స్ట్రైకర్ అయిన గ్రీన్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తోంది. విరాట్ కోహ్లితో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్ చేస్తుండగా.. గత మ్యాచ్‌లో విల్‌జాక్స్ వన్‌డౌన్లో రాగా..పేస్‌ఆల్‌రౌండర్ గ్రీన్ ఐదో స్థానంలో బరిలోకి దిగాడు.
చదవండి: MS Dhoni Angry Video: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment