నాగ్‌పూర్‌ వన్డే : భారత్‌దే బ్యాటింగ్‌ | Australia Won The Toss And Choose To Field First | Sakshi
Sakshi News home page

నాగ్‌పూర్‌ వన్డే : భారత్‌దే బ్యాటింగ్‌

Published Tue, Mar 5 2019 1:13 PM | Last Updated on Tue, Mar 5 2019 1:15 PM

Australia Won The Toss And Choose To Field First - Sakshi

నాగ్‌పూర్‌ వన్డే : భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ ఛేజింగ్‌కే మొగ్గుచూపాడు. ఇక భారత్‌ ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. హైదరాబాద్‌ వన్డే విజయంతో ఉత్సాహంగా ఉన్న కోహ్లిసేన ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఇక ఆసీస్‌ రెండు మార్పులు చేసింది. ఆష్‌తోన్‌ టర్నర్‌, జాసన్‌ బెహెండ్రాఫ్‌లకు ఉద్వాసన పలికి షాన్‌ మార్ష్‌, నాథన్‌ లియోన్‌లకు అవకాశం కల్పించింది. ఈ మ్యాచ్‌ను ఎలాగైన గెలిచి గట్టిపోటీనివ్వాలని భావిస్తోంది. ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌కు ముందు మిగిలున్నవి ఈ నాలుగు వన్డేలే కావునా.. ప్రతి మ్యాచ్‌ను ఇరు జట్లు కీలకంగా భావిస్తున్నాయి.

తుది జట్లు 
భారత్ ‌: కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ, రాయుడు, ధోని, కేదార్‌ జాదవ్, విజయ్‌ శంకర్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా. 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), ఖాజా, షాన్‌ మార్ష్‌, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, క్యారీ, కూల్టర్‌ నీల్, కమిన్స్, నాథన్‌ లియోన్‌, జంపా.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement