KKR Rope In Aaron Finch As Replacement For Alex Hales: ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒకరు. ఫామ్ లేమి, వయసు పైపడిన దృష్ట్యా ఏ ఫ్రాంచైజీ అతన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ జట్టు నుంచి అనూహ్యంగా (బయోబబుల్ వాతావరణంలో ఇమడలేక) తప్పుకోవడంతో ఫించ్‌కు ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చే లక్కీ ఛాన్స్ దక్కింది.
🚨 Aaron Finch joins KKR as a replacement for Alex Hales.
— KolkataKnightRiders (@KKRiders) March 11, 2022
Welcome to the #GalaxyOfKnights, @AaronFinch5! 💜#KKR #KKRHaiTaiyaar #IPL2022 pic.twitter.com/3HnSyKogV2
ఫించ్‌ను కేకేఆర్ రూ. 1.5 కోట్ల బేస్‌ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. గతంలో ఏకంగా 8 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆడిన రికార్డు ఉన్న 35 ఏళ్ల ఫించ్..గత సీజన్‌లో కోహ్లి నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫించ్ ఐపీఎల్ కెరీర్లో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడి 25.7 సగటున, 127.7 స్ట్రైయిక్‌రేట్‌తో 2005 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసీస్ వన్డే, టీ20 జట్లకు నాయకత్వం వహిస్తున్న ఫించ్.. ఐపీఎల్ ప్రారంభ సమయానికి పాకిస్థాన్ పర్యటనలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 6 వరకు ఆసీస్.. పాక్‌తో 3 వన్డేలు, ఏకైక టీ20 ఆడాల్సి ఉంది.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న ఆస్ట్రేలియా స్టార్ బౌలర్!
Comments
Please login to add a commentAdd a comment