ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు | Misbah ul Haq hits six sixers in six balls in T20 match | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 10 2017 5:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

హాంకాంగ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 బ్లిట్జ్‌ టోర్నీలో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ మిస్బా ఉల్‌ హక్‌ వీరవిహారం చేశాడు. తాను ఎదుర్కొన్న ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీ వహించిన హాంకాంగ్ కింగ్ ఐలాంట్ (హెచ్‌కేఐ) యునైటెడ్ జట్టు ప్రత్యర్థి హాంగ్ హోమ్ జాగ్వార్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం నాడు ఈ టోర్నీలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో హెచ్‌కేఐ యునైటెడ్ కెప్టెన్ మిస్బా.. హాంగ్ హోమ్ జాగ్వార్స్ బౌలర్ వేసిన 19వ ఓవర్లో చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరో బౌలర్ క్యాడీ వేసిన 20వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి నాలుగు బంతులను సిక్సర్లు బాదాడు. దీంతో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ను నమోదు చేశాడు. అసలే స్డేడియంలో గ్యాలరీ చిన్నది కావడంతో తొలి రెండు బంతులను మిస్బా స్డేడియం అవతలికి పంపించాడు. అదే ఓవర్లో ఆఖరి బంతిని మిస్బా ఫోర్ కొట్టాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement