పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది చిక్కుల్లో పడ్డాడు. హిందూ సంప్రదాయాలపై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గతంలో ఆయన ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో మీడియా ప్రతినిధి అఫ్రిదిని ఎప్పుడైనా టీవీ పగలగొట్టారా అని ప్రశ్నించింది. దీనికి అఫ్రిది అవునని సమాధానమిచ్చాడు. కొన్ని షోలు నచ్చవని, కానీ అతని భార్యకు ఆ షోలపై ఆసక్తి ఉండటంతో పిల్లలతో కాకుండా ఒంటరిగా చూడటానికి అంగీకరించానని తెలిపాడు. అయితే ఓరోజు తన పిల్లలు టీవీ ముందు నిలబడి షోలో వస్తున్న ‘హారతి’ విధానాన్ని యథాతథంగా అనుకరించడం చూశానన్నాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన అఫ్రిది భార్యవైపు విసురుగా చూసి ఆవేశంతో టీవీ పగలగొట్టాడు.
దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున విమర్శిస్తున్నారు. అఫ్రిదిది అత్యంత హేయమైన చర్యగా పలువురు అభివర్ణించారు. కాగా పాకిస్తాన్ టీంలో వివక్ష చూపిస్తారని వార్తలు ప్రచారమైన నేపథ్యంలో ఈ పాత వీడియో తిరిగి ప్రాచుర్యం సంతరించుకుంది. స్పిన్నర్ కనేరియా హిందూ కావడం వల్లే అతడిపై సహచర క్రికెటర్లు వివక్ష చూపేవారని ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అది వాస్తవమేనని కనేరియా సైతం అంగీకరించాడు. కాగా అఫ్రిది గతంలోనూ ఆర్టికల్ 370 రద్దు సమయంలో భారత్‌పై విషం కక్కాడు. దీనికి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి:
అఫ్రిది నీకసలు బుర్ర ఉందా?
Comments
Please login to add a commentAdd a comment