India Vs Pakistan T20WC.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న జరగనున్న దాయాదుల పోరు(ఇండియా వర్సెస్ పాకిస్తాన్) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐసీసీ మేజర్ టోర్నీల్లో పాకిస్తన్‌పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. అంతేగాక టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు ఐదు సార్లు తలపడగా.. ఐదింటిలోనూ టీమిండియానే విజయం వరించడం విశేషం. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: T20WC 2021: డీఆర్‌ఎస్, డక్‌వర్త్ లూయిస్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం
''ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒత్తిడితో కూడుకున్నది. ఆరోజు మ్యాచ్‌లో ఎవరైతే ఒత్తిడిని అధిగమిస్తారో వాళ్లే మ్యాచ్‌ను గెలుచుకుంటారు. ఇదీగాక మ్యాచ్‌లో ఎవరు తక్కువ తప్పులు చేస్తారో వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరుజట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ఏ చిన్న తప్పు చేసినా అది జీవితకాలం వెంటాడుతుంది. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో మిస్బా చేసిన చిన్న పొరపాటు అతనికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడితే మ్యాచ్‌ను గెలవడం ఈజీ'' అని పేర్కొన్నాడు.
ఇక టి20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ జట్టులో మూడు మార్పులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీ, ఫఖర్ జమాన్‌లు జట్టులోకి వచ్చారు. ఇక గాయంతో సోహైబ్ మక్సూద్ ప్రపంచకప్‌కు దూరవమగా.. అతని స్థానంలో సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఎంపికచేశారు.
చదవండి: T20 World Cup 2021: ఉమ్రాన్ మాలిక్‌కు బంపర్ ఆఫర్!
Comments
Please login to add a commentAdd a comment