Shahid Afridi Comments on Virat Kholi: టీ20 ప్రపంచకప్- 2021లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత భారత టీ20 కెప్టన్సీ భాధ్యతల నుంచి తప్పకున్న విరాట్ కోహ్లిపై.. పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి బ్యాటర్‌గా రాణించాలంటే అన్నిఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవాలని అతడు సూచించాడు. కోహ్లి వారసుడిగా రోహిత్ శర్మను నియమించినందుకు బీసీసీఐని అఫ్రిది ప్రశంసించాడు.
"భారత క్రికెట్‌కు కోహ్లి విలువైన ఆస్తి అని నేను భావిస్తున్నాను. అయితే అతడు ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా తప్పుకుంటే ఉత్తమం అని నేను భావిస్తున్నాను. ఇక రోహిత్ విషయానికి వస్తే.. "నేనుఐపీఎల్ లో (డెక్కన్ ఛార్జర్స్ తరఫున) రోహిత్‌తో ఏడాది పాటు ఆడాను. అతడు అత్యుత్తమ ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా దూకుడుగా ఆడగలడు లేదంటే క్లిష్ట పరిస్థితుల్లో నిలకడగా ఆడతాడు. అతడి షాట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. అంతకు మించి ఆటగాళ్లకు మంచి నాయకుడిగా ఉండగల ఆర్హత రోహిత్‌కు ఉంది అని ఆఫ్రిది పేర్కొన్నాడు.
చదవండి: టి20 ప్రపంచకప్ 2021: విజేత ఎవరో చెప్పిన పీటర్సన్
Comments
Please login to add a commentAdd a comment