Virat Kohli: అగ్రస్థానంలో బాబర్‌ ఆజమ్‌.. 4 స్థానాలు దిగజారిన కోహ్లి.. ఏకంగా.. | ICC Mens T20I Rankings: Virat Kohli Slips 4 Spots KL Rahul At 5th Position | Sakshi
Sakshi News home page

Virat Kohli: అగ్రస్థానంలో బాబర్‌ ఆజమ్‌.. 4 స్థానాలు దిగజారిన కోహ్లి.. ఏకంగా..

Published Wed, Nov 10 2021 4:14 PM | Last Updated on Wed, Nov 10 2021 4:55 PM

ICC Mens T20I Rankings: Virat Kohli Slips 4 Spots KL Rahul At 5th Position - Sakshi

ICC Mens T20I Rankings: Virat Kohli Slips 4 Spots KL Rahul At 5th Position: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు పొట్టి ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా టీ20 మాజీ సారథి విరాట్‌ కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు దిగజారాడు. ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఈ మెగా ఈవెంట్‌లో మొత్తంగా 3 ఇన్నింగ్స్‌లో 68 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి ర్యాంకు ఈ మేరకు పడిపోగా.. టీ20 కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తమ స్థానాలను మెరుగపరచుకున్నారు. ఈ టోర్నీలో 194 పరుగులతో టీమిండియా టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కేఎల్‌ రాహుల్‌.. ఐదో స్థానానికి చేరుకోగా.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.

అదరగొట్టిన బాబర్‌ ఆజమ్‌
ఇక కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్బుతంగా రాణిస్తున్న పాకిస్తాన్‌ సారథి బాబర్‌ ఆజమ్‌ 839 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. డేవిడ్‌ మలన్‌(ఇంగ్లండ్‌- 800), ఎయిడెన్‌ మార్కరమ్‌(సౌతాఫ్రికా- 796), ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా కెప్టెన్‌- 732), కేఎల్‌ రాహుల్‌(ఇండియా- 727) టాప్‌-5లో చోటుదక్కించుకున్నారు. 

చదవండి: Harbhajan Singh: 62 నాటౌట్‌, 70, 79 నాటౌట్‌.. అతడేం పాపం చేశాడు.. ఇంకేం చేస్తే సెలక్ట్‌ చేస్తారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement