T20 World Cup 2021: Rohit Sharma and Virat Kohli Gift Their Bats to Outgoing Head Coach Ravi Shastri - Sakshi
Sakshi News home page

Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు

Published Tue, Nov 9 2021 4:40 PM | Last Updated on Tue, Nov 9 2021 8:26 PM

T20 World Cup 2021: Rohit Sharma And Virat Kohli Gift Their Bats To Outgoing Head Coach Ravi Shastri - Sakshi

Rohit Sharma And Virat Kohli Gift Their Bats To Ravi Shastri: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా పదవీకాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రికి టీమిండియా సారధి, ఉప సారధి విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు అపురూప కానుకలతో ఘనంగా వీడ్కోలు పలికారు. విరాట్‌, రోహిత్‌లు వారు సంతకాలు చేసిన బ్యాట్లను రవిశాస్త్రికి కానుకగా అందజేసి సెండాప్‌ ఇచ్చారు. డ్రెసింగ్‌​ రూమ్‌లో రవిశాస్త్రి వీటిని పట్టుకుని దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.  


ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి శకం టీ20 ప్రపంచకప్‌-2021తో ముగిసిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా నవంబర్‌ 8న నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు రవిశాస్త్రి చివరిసారిగా కోచింగ్‌ సేవలను అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పసికూన నమీబియాపై ఘన విజయం సాధించి హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు ఘనంగా వీడ్కోలు పలికింది. కోచింగ్‌ సిబ్బందికి, కెప్టెన్‌గా విరాట్‌కు చివరి రోజు కావడంతో భారత డ్రెసింగ్‌ రూమ్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొని ఉండింది. 


చదవండి: Ravi Shastri: టీమిండియా ఆటగాళ్లేమైనా యంత్రాలా, పెట్రోల్‌ పోసి నడపడానికి..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement