Rohit Sharma goes past Virat Kohli and other interesting stats: టీ20 ప్రపంచకప్-2021లో భారత ప్రయాణం ముగిసింది. నవంబరు 8న నమీబియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా 9వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక 2012 తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో భారత్ నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. అయితే ఈ మ్యాచ్‌తో టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లి శకం ముగిసింది. మరో వైపు భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తమ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఇంటి ముఖం పట్టినప్పటికీ నమీబియాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పలు రికార్టులు సృష్టించింది. అసలు సాధించిన రికార్డులేంటో ఓ లుక్కేద్దాం..
ఒకే ఒక్కడు..
ఐసీసీ ఈవెంట్‌లో భారత్‌కు ఒక్కసారి కూడా ట్రోఫిని అందించకపోయనప్పటకీ... విరాట్ కోహ్లి జట్టును అన్ని ఫార్మాట్లలో విజయం పథంలో నడిపించాడు. టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ల్లో ఒకడిగా రికార్డు సృష్టించి కోహ్లి తన భాధ్యతలనుంచి తప్పుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 50 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు సారథ్యం వహించిన కోహ్లి.. అందులో 32 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి మూడో స్ధానంలో ఉన్నాడు. మెదటి స్ధానంలో ఆప్గానిస్తాన్ కెప్టెన్ అస్గర్ అఫ్గన్ 42 విజయాలతో ఉన్నాడు. రెండో స్ధానంలో 37 విజయాలతో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నాడు.
పలు రికార్డులను బద్దలు కొట్టిన హిట్ మ్యాన్..
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో పలు రికార్డులను సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఆర్ధసెంచరీలను నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 8 ఆర్ధసెంచరీలు సాధించిన హిట్ మ్యాన్ ఈ ఘనతను అందుకున్నాడు. మెదటి స్ధానంలో విరాట్ కోహ్లి (10),ఉండగా, తర్వాతి స్ధానంలో క్రిస్ గేల్ (9) ఉన్నాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఆర్ధసెంచరీలు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.
అంతకముందు ఈ రికార్డు గౌతమ్ గంభీర్ పేరిట నమోదైంది. ఇక టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా మరో రికార్డు సాధించాడు. అంతక ముందు విరాట్ కోహ్లి 845 పరుగులతో మొదటి స్ధానంలో ఉన్నాడు. అయితే 847 పరుగులు చేసిన రోహిత్ కోహ్లిని ఆదిగిమించాడు. మరో వైపు విరాట్ కోహ్లీ, మార్టిన్ గప్టిల్ తర్వాత టీ20ల్లో 3,000 పరుగుల క్లబ్‌లో చేరిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన రోహిత్.. టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
రెండో స్పిన్నర్‌గా...
రవిచంద్రన్ అశ్విన్ నవంబరు 8న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించాడు. దీంతో ఐసీసీ వైట్-బాల్ ఈవెంట్లలో 50 వికెట్ల మార్కును చేరుకున్న రెండవ భారతీయ స్పిన్నర్ గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.
చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్!
Comments
Please login to add a commentAdd a comment