
సాక్షి, న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కశ్మీరీలను త్వరలోనే కలవబోతున్నానని, ఎల్‌ఓసీ వద్ద శాంతి పతాకాన్ని ఎగురువేస్తానని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు. కొంతమంది బుర్రలు ఎప్పటికీ ఎదగవని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీటర్‌లో అఫ్రిది వ్యాఖ్యలకు తనదైన శైలిలో బదులిచ్చారు. ‘కొంతమంది బుర్రలు ఎప్పటికీ ఎదగవు. అంతర్జాతీయ క్రికెట్ ఆడినా వారి బుర్ర మాత్రం పెరగడం లేదు. ఆయన బుర్ర ఎప్పటికీ ఎదగదు. ఆయన ప్రతీది రాజకీయం చేయాలనుకుంటున్నారు. అలా అయితే ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా ప్రజలతో.. మానసిక పరిపక్వత గత వ్యక్తిలా మాట్లాడాలి’ అంటూ అఫ్రీదికి పరోక్షంగా చురకలు అంటించారు.
మరో ట్వీట్‌టో అఫ్రిది ఫోటో షేర్ చేస్తూ..‘ ఒక అఫ్రిదీతో మరో అఫ్రిదీ మాట్లాడుతున్నారు చూడండి. తర్వాత ఏం చేయాలో ఆయనను ఆయనే అడుగుతున్నాడు. కానీ ఆయన సందేహాలలో మాత్రం పరిపక్వత లేదనేది నిరూపితమవుతుంది. అఫ్రిదీ.. కైండర్‌గార్డెన్ వద్ద పాఠాలు నేర్చుకోవడానికి ఆన్‌లైలో ఆర్డర్ ఇవ్వు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా పాకిస్తాన్ సైన్యం శుక్రవారం మధ్యాహ్నం కశ్మీర్ అవర్‌ను పాటించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తాను నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)వద్దకు వెళ్లి శాంతి పతాకాన్ని ఎగురవేస్తానని అఫ్రిది వెల్లడించారు.
Guys, in this picture Shahid Afridi is asking Shahid Afridi that what should Shahid Afridi do next to embarrass Shahid Afridi so that’s it’s proven beyond all doubts that Shahid Afridi has refused to mature!!! Am ordering online kindergarten tutorials for help @SAfridiOfficial pic.twitter.com/uXUSgxqZwK
— Gautam Gambhir (@GautamGambhir) August 28, 2019