‘లాలా ఐ యామ్‌ సారీ’.. బౌలర్‌ క్షమాపణలు | PSL 2020: Haris Rauf Apologise Shahid Afridi After Blowing Him Out | Sakshi
Sakshi News home page

మొదటి బంతికే డకౌట్‌, సారీ చెప్పిన బౌలర్‌

Published Mon, Nov 16 2020 3:13 PM | Last Updated on Mon, Nov 16 2020 3:27 PM

PSL 2020: Haris Rauf Apologise Shahid Afridi After Blowing Him Out - Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశంలో రసవత్తరంగా సాగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2020 ఎలిమినేషన్‌ దశకు చేరుకుంది. లాహోర్‌ ఖలందర్‌, ముల్తాన్‌ సుల్తాన్‌ జట్ల మధ్య కరాచీలో ఆదివారం జరిగిన ఎలిమినేటర్‌-2 మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాక్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదిని డకౌట్‌ చేసిన లాహోర్‌ బౌలర్‌ హారిస్‌ రావూఫ్‌ అతనికి క్షమాపణలు చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌ 14 వ ఓవర్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ జట్టు 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ముల్తాన్‌ జట్టు 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి కష్టాల్లో పడింది.

ఆ సమయంలో క్రీజులోకొచ్చిన అఫ్రిదిని రావూఫ్‌ మొదటి బంతికే డకౌట్‌ చేశాడు. రావూఫ్‌ విసిరిన ఇన్‌స్వింగర్‌ అఫ్రిది కాళ్ల మధ్యలోంచి చొచ్చుకెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో తన ఫేవరెట్‌ ఆటగాడికి రావూఫ్‌ రెండు చేతులు జోడించి నవ్వుతూ దండం పెట్టాడు. ‘లాలా ఐ యామ్‌ సారీ’ అంటూ మ్యాచ్‌ అనంతరం వీడియోను జతచేస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌ అయింది. కాగా, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 157 పరుగులే చేసిన ముల్తాన్‌ జట్టు పరాజయం పాలైంది. లాహోర్‌ జట్టు ఫైనల్స్‌కి చేరింది. నవంబర్‌ 17న కరాచీ కింగ్స్‌తో తలపడనుంది.
(చదవండి: ఆస్ట్రేలియా టూర్‌పై కరోనా ప్రభావం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement