కరాచీ: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి దాదాపు రెండేళ్లు అయినప్పటికీ తనలో సత్తా తగ్గలేదని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్న పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది.. తాజాగా అభిమానుల్ని మరోసారి అబ్బురపరిచాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో భాగంగా కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న బరిలో దిగిన కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. దుబాయ్‌లో క్వెట్టా గ్లేడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రిది ఫీల్డింగ్‌లో మ్యాజిక్ చేశాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన క్వెట్టా 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
కానీ ఓ ఎండ్‌లో ఉమర్ అమిన్ ధాటిగా ఆడే యత్నం చేస్తున్నాడు. లక్ష్యానికి కావాల్సిన రన్‌రేట్ భారీగా ఉండటంతో ఇర్ఫాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌ను ఆడేందుకు అమిన్ బంతిని గాల్లోకి కొట్టాడు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న ఆఫ్రిది ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. కానీ, బ్యాలెన్స్‌ను ఆపుకోలేక బౌండరీలైన్ దాటే సమయంలో బంతిని మైదానంలోకి విసిరాడు. మళ్లీ అంతే వేగంగా తిరిగొచ్చి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌తో స్టేడియం హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment