ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్‌ను విజయంతంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తుంది.
ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను సైతం పీసీబీ.. ఐసీసీకి పంపింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది.
ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని డిమాండ్ చేస్తోంది. కానీ పీసీబీ మాత్రం ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని మొండి పట్టు పట్టింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి రావడానికి భారత్‌కు ఇష్టం లేదని, భద్రతను సాకుగా ఉపయోగించుకుంటుందని అఫ్రిది ఆరోపించాడు. ఇప్పటికే చాలా మంది పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టు తమ దేశానికి రావాలని వాదిస్తున్నారు.
"మేము క్లిష్లమైన పరిస్ధితుల్లో కూడా ఆడేందుకు భారత్‌కు చాలాసార్లు వెళ్లాం. మాకు బెదిరింపులు వచ్చిన సందర్భాల్లో కూడా మేము భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడాము. మమ్మల్ని భారత్‌కు పంపేందుకు మా దేశ ప్రభుత్వం గానీ, పీసీబీ గానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
గతేడాది కూడా మా జట్టు వరల్డ్‌కప్‌లో తలపడేందుకు భారత్‌కు వెళ్లింది. మేము ఎప్పుడూ భారత్‌కు సపోర్ట్‌గా ఉంటాము. కాబట్టి వారు కూడా ఇక్కడకు వచ్చి ఆడాలని నేను కోరుకుంటున్నానని" అఫ్రిది ఓ పాక్ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment