
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది శుక్రవారం మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షాను నిఖా చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే.. తాజాగా మరొక వీడియో బయటకొచ్చింది. ఒక పక్కన పెళ్లి సందడి నడుస్తున్న సమయంలోనే మామకు అల్లుడు బౌలింగ్ చేయడం.. ఆ బంతిని మామ సిక్సర్ తరలించడం ఆకట్టుకుంది.
ఇదంతా పీఎస్‌ఎల్ ప్రాక్టీస్ అని వీడియో ద్వారా అర్థమయింది. ఫిబ్రవరి 13 నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ప్రారంభమవనున్న నేపథ్యంలో లీగ్‌లో పాల్గొనే జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో లాహోర్ ఖలండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షాహిన్ తన ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు చెమటోడుస్తున్నాడు.
ప్రాక్టీస్‌లో భాగంగా మామ షాహిద్ అఫ్రిదికి.. అల్లుడు షాహిన్ అఫ్రిది బౌలింగ్ చేశాడు. షాహిన్ విసిరిన వేగవంతమైన బంతిని షాహిద్ అంతే వేగంగా భారీ సిక్సర్‌గా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియోనూ క్రికెట్ పాకిస్తాన్ తమ ట్విటర్‌లో పంచుకుంది. ''వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే.. #PaksitanCricket #ShahidAfridi..'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
ఇక గతేడాది లాహోర్ ఖలండర్స్ తొలి పీఎస్‌ఎల్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంలో షాహిన్ అఫ్రిది పాత్ర కీలకం.. బ్యాట్‌తో పాటు బంతితో రాణించిన అఫ్రిది ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు తొలి టైటిల్ అందించాడు.
𝐀𝐠𝐞 𝐢𝐬 𝐣𝐮𝐬𝐭 𝐚 𝐧𝐮𝐦𝐛𝐞𝐫🔥#PakistanCricket #ShahidAfridipic.twitter.com/THeMzEO1Ib
— Cricket Pakistan (@cricketpakcompk) February 2, 2023
Comments
Please login to add a commentAdd a comment