ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అండగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లి.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా అదే తీరును కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో నిరాశపరిచిన అతడు టీ20, వన్డే సిరీస్‌లోను రాణించలేకపోతున్నాడు. దీంతో కోహ్లి పై విమర్శలు వర్షం కురుస్తోంది. అయితే కోహ్లిని కొంత మంది విమర్శిస్తుంటే, మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే కోహ్లికు బాబర్ సపోర్ట్‌గా నిలిచాడు. లార్డ్స్ వన్డే లో కోహ్లి ఔటయ్యాక.. "కష్టకాలం గడిచి పోతుంది.. ధైర్యంగా ఉండు" అంటూ బాబర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బాబర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కోహ్లికి మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేసిన బాబర్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసించాడు. కోహ్లి విషయంలో బాబర్ స్పందన అద్భుతమైనది అని అతడు కొనియాడాడు. అదే విధంగా బాబర్ ట్వీట్‌పై కోహ్లి స్పందించాలని అతడు సూచించాడు.
"దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి క్రికెట్ లేదా మరే ఏ ఇతర క్రీడ అయినా ఊపయోగ పడుతుంది. అథెట్లు రాజకీయ నాయకుల కంటే మెరుగ్గా పని చేయగలరు. ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు అది చేసి చూపించారు. ఇక విరాట్ విషయంలో బాబర్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. కాగా విరాట్ నుంచి రిప్లై వచ్చిందో లేదో నాకు తెలియదు. అయితే బాబర్ ట్వీట్‌కు కోహ్లి తప్పకుండా స్పందించాలి. ఒక వేళ బాబర్ ట్వీట్‌కు విరాట్ రిప్లే ఇస్తే అది చాలా పెద్ద విషయం అవుతంది. కానీ కోహ్లి స్పందిస్తాడని నేను అనుకోవడం లేదు" అని అఫ్రిది పేర్కొన్నాడు.
చదవండి: Chamika Karunaratne: లంక క్రికెటర్‌ను చుట్టుముట్టిన కష్టాలు.. రెండురోజుల పాటు
Comments
Please login to add a commentAdd a comment