Virat Kohli-Babar Azam: ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విమర్శలతో పాటు సానూభూతి సందేశాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. విరాట్‌కు మద్దతుగా నిలబడిన ప్రముఖుల్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉన్నారు. కోహ్లిని టార్గెట్ చేస్తున్న వారికి హిట్‌మ్యాన్ తనదైన శైలిలో కౌంటిస్తుండగా, పాక్ కెప్టెన్.. ఫామ్ కోల్పోయిన తన ఆరాధ్య క్రికెటర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు.
Thank you. Keep shining and rising. Wish you all the best 👏
— Virat Kohli (@imVkohli) July 16, 2022
ఫామ్ కష్టాలు త్వరలో సమసి పోతాయి.. ధైర్యంగా ఉండు అంటూ బాబర్ చేసిన ట్వీట్‌పై కోహ్లి కొద్దిసేపటి క్రితమే స్పందించాడు. థ్యాంక్యూ.. నువ్వు ఇలాగే రాణిస్తూ, ఎదుగుతూ ఉండాలి.. ఆల్ ది బెస్ట్ బాబర్ అంటూ బదులిచ్చాడు. బాబర్ ట్వీట్‌పై కోహ్లి స్పందించాల్సి ఉండిందని షాహిద్ అఫ్రిది ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కోహ్లి రిప్లై ఇవ్వడం విశేషం.
ఇదిలా ఉంటే, కెరీర్ ఆరంభంలో బాబార్ ఆజమ్.. కోహ్లిని గురువు అని, రోల్ మోడల్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాబర్ ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ కోహ్లినే తన ఆరాధ్య క్రికెటర్‌గా పేర్కొంటాడు. కోహ్లి బ్యాటింగ్ చూస్తూనే తాను ఎదిగానంటూ బాబర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు. బాబర్ ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ దశలో కొనసాగుతుండగా.. కోహ్లి దుర్భర దశను ఎదుర్కొంటున్నాడు.
చదవండి: బాబర్ ట్వీట్‌కు కోహ్లి తప్పకుండా రిప్లై ఇవ్వాలి: షాహిద్ అఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment