
కోల్‌కతా: పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు తమ అసలు వయసును కాకుండా ఫేక్ సర్టిఫికేట్లతో దాన్ని కప్పిపుచ్చుతారనే ఆరోపణలు మరొకసారి తెరపైకి వచ్చాయి. పాకిస్తాన్ క్రికెటర్లు వయసును దాస్తారనే ఆరోపణలు గతం నుంచే ఉండగా, ఇప్పుడు నసీర్ షా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అరంగేట్రం చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నసీర్ షా ఆసీస్‌తో మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేయడంతో అతని వయసు ఎంత అనే దానిపై సందేహాలు వెల్లువత్తుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో నసీర్ షా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఆడినప్పుడు అతని వయసు 17 ఏళ్లు అని ఆ దేశానికే చెందిన సాజ్ సాదిక్ ట్వీట్ చేయడం, తాజాగా అతనికి 16 ఏళ్లు అంటూ పేర్కొనడంతో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అనుమానం వ్యక్తం చేశాడు.
అప్పుడు 17 ఏళ్లైతే.. ఇప్పుడు 16 ఏళ్లు ఎలా అవుతాయనేది కైఫ్ అనుమానం. సాజ్ సాదిక్‌ను ట్వీట్‌ను లింక్ చేస్తూ కైఫ్ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఇక్కడ ఒక అద్భుతమైన లెక్క కనబడుతోంది. ఇప్పుడు 16 ఏళ్లు. వయసును వెనక్కి నెడుతున్నారని అనుకుంటున్నా’ అని కైఫ్ ట్వీట్ చేశాడు. ఇందుకు గత ఏడాది సాజ్ సాదిక్ చేసిన ట్వీట్‌ను సైతం లింక్ చేశాడు.దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఇది పాకిస్తాన్ క్రికెటర్లకు అలవాటే. గతంలో కూడా ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూడా తన వయసును దాచాడు.అఫ్రిదిలానే నసీమ్ కూడా వయసును వెనక్కి జరుపుకున్నాడు’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘ నసీమ్ రిటైర్ అయ్యే సమయానికి కూడా 16 ఏళ్లే ఉంటాయి’ అని మరొక నెటిజన్ సెటైర్ వేశాడు. ‘ ఇప్పటికీ అఫ్రిది నిజమైన వయసు మిస్టరీనే. అలాగే ఇప్పుడు నసీమ్ కూడా’ అని మరొకరు ట్వీట్ చేశారు.
Looks a terrific prospect. But is 16 now, aging backwards i think https://t.co/frlg06ZIFk
— Mohammad Kaif (@MohammadKaif) November 22, 2019