బ్రిస్బేన్: పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన యువ క్రికెటర్‌గా నసీమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసీస్‌తో బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో నసీమ్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. నసీమ్ 15 ఏళ్ల 279 రోజుల వయసులో టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ రికార్డు ఇప్పటివరకూ ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉంది.
1953లో ఇయాన్ క్రెయిగ్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 17 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై పిన్న వయసులో టెస్టు అరంగేట్రం చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని నసీమ్ బ్రేక్ చేశాడు. ఆరు దశాబ్లాత తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై పిన్న వయసులో టెస్టు అరంగేట్రం చేసిన రికార్డును నసీమ్ తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 7 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నసీమ్ షా 27 వికెట్లు సాధించడంతో పాక్ జట్టులో తొందరగా అరంగేట్రం చేయడానికి మార్గం సుగమం అయ్యింది.
ఆసీస్‌తో ఆరంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. అసాద్ షఫీక్(76) రాణించగా, కెప్టెన్ అజహర్ అలీ(39), మహ్మద్ రిజ్వాన్(37)లు ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు సాధించగా, ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. హజల్‌వుడ్‌కు రెండు, నాథన్ లయన్‌కు వికెట్ లభించాయి. పాకిస్తాన్ ఆలౌటైన అనంతరం తొలి రోజు ఆట కూడా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment