
Shahid Afridi Praises Virat Kohli: ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన కోహ్లి సేన.. హైదరాబాద్‌పై నెగ్గి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేగాక.. గత సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమను ఓడించి టైటిల్ గెలిచే అవకాశాలకు గండికొట్టిన ఆరెంజ్ ఆర్మీని ఎలాగైనా చిత్తు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు నెట్స్‌లో బాగానే శ్రమిస్తున్నారు.
ఈ క్రమంలో తన ప్రాక్టీసు సెషన్‌కు సంబంధించిన వీడియోను కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హైదరాబాద్ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘గొప్ప ఆటగాళ్లు ప్రాక్టీసులో కూడా వందకు వంద శాతం నిబద్ధతతో ఆడతారు. కన్నుల పండుగగా ఉంది’’ అని కోహ్లిని కొనియాడాడు. కాగా ఐపీఎల్ 2021లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లలో కోహ్లి 357 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 72(నాటౌట్).
చదవండి: పాక్ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్
Aakash Chopra: వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..?
Treat to watch - A great player always gives 100% in practice!! 👏👏 https://t.co/5sxxVaqXYw
— Shahid Afridi (@SAfridiOfficial) October 5, 2021
Comments
Please login to add a commentAdd a comment