shoib malik
-
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. వరుసగా నాలుగో విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కాగా ఇది పాక్‌కు వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మక్సూద్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షోయబ్ మాలిక్(21) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మీకర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాడీ, స్కోఫీల్డ్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన ఆజ్మల్..197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 117 పరుగులకే కుప్పకూలింంది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ ఆజ్మల్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. రజాక్ రెండు, సోహైల్ ఖాన్, మాలిక్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ మాస్టర్డ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య -
షోయబ్ మూడో పెళ్లి: ఇంతకీ ఎవరీ సనా? అపుడు ఆయేషా, ఇపుడు సానియా
పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ దిగ్గజం సానిమా మీర్జాను మోసం చేశాడా? ఆమెకు అన్యాయం చేసి మూడోపెళ్లి చేసుకున్నాడా? అసలు సానియాకు విడాకులిచ్చాడా? నటి సనా జావేద్‌తో షోయబ్ పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో ఇవే ప్రశ్నలు,చర్చలు జోరుగా నడుస్తున్నాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేర్లు క్రీడా ప్రపంచంలో తెలియను వారుండరు. అయితే పెళ్లిళ్ల విషయంలోవివాదంలో చిక్కుకోవడం షోయబ్‌కు ఇదే మొదటిసారికాదు. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో షోయబ్ మొదటి భార్య కోర్టు కెక్కింది. అయేషా సిద్ధిఖీ సానియాతో పెళ్లికి కొన్ని రోజుల ముందు తనను మోసం చేశాడంటూ షోయబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షోయబ్ వ్యవహారం వెలుగులో వచ్చింది. 2002లో పెళ్లి చేసు కున్నాడంటూ “నిఖాహనామా” కాపీలను మీడియాకు చూపడంతో వివాదం రాజుకుంది. దీంతో తొలుత ఆమె వాదనను తిరస్కరించిన షోయబ్ చివరకు ఆయేషాను వివాహం చేసుకున్నట్లు అంగీకరించాడు. 2010, ఏప్రిల్ 7న ఆమెకు విడాకులు ఇచ్చాడు. రూ.15కోట్ల భరణం ఇచ్చినట్టు కూడా సమాచారం. తాజాగా శనివారం (జనవరి 20, 2024) పాపులర్ పాక్ నటి సనా జావేద్‌తో నిఖా చేసుకున్నట్టు షోయబ్ సోషల్ మీడియాలో ఫోటోషేర్ చేయడం అందర్నీ విస్మయపర్చింది. షోయబ్, సనా పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సనా జావేద్ ఎవరు? సనా జావేద్ కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. 2012లో గ్లాయర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సనా షెహర్-ఎ-జాత్, ప్యారే అఫ్జల్, జరా యాద్ కర్, రుస్వాల్, డంక్, ఇంతేజార్ వంటి అనేక సీరియల్స్‌లో పనిచేసింది. రొమాంటిక్ డ్రామా 'ఖానీ'లో టైటిల్ రోల్ద్వారా బాగా పాపులర్ అయింది. సనా ప్రస్తుతం ARY డిజిటల్ డ్రామా, సుకూన్‌లో యాక్ట్ చేస్తోంది. షోయబ్ మాలిక్‌తో పెళ్లికి ముందు, పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను 2020లో వివాహం చేసుకుంది. ఒకరికొరు 'ఖుబూల్ హై' అని చెప్పుకున్నది మొదలు వరుసగా బ్యూటిఫుల్ పిక్స్, నిరంతరం సోషల్ మీడియా అప్డేట్స్తో బ్యూటిఫుల్ కపుల్‌గా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. కొన్ని రోజులకే సడెన్‌గా వీరి పోస్ట్‌లు ఆగిపోవడం, ఆ తరువాత 2023లో ఇన్స్టానుంచి వెడ్డింగ్, ఈద్ తదితర వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇద్దరూ తొలగించడంతో వీరు విడిపోయారనే పుకార్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పుడే హింట్ గత ఏడాదినుంచి వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నట్లు ఊహాగానాలున్నాయి. ఈ పుకార్లు మార్చి 25, 2023న సనాకు పుట్టినరోజు సందర్భంగా మరింత ఆజ్యం పోశాడు షోయబ్. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "హ్యాపీ బర్త్‌డే, బడ్డీ" అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అలా షోయబ్ తమ ప్రేమ, పెళ్లిపై తొలి హింట్ ఇచ్చాడు. సానియా ఆవేదనకు అద్దం లేటెస్ట్ పోస్ట్ బహుశా తన గుండె పగిలే షోయబ్ పెళ్లి వార్త ముందే తెలుసో ఏమో.. జీవితం అంటే అంత ఈజీ కాదు. జీవితంలో పెళ్లి, విడాకులు రెండూ కష్టమే. ఈరెండు దారుల్లో ఒకదానికి ఎంచుకోవడం మరీ కష్టం అంటూ ఆవేదనతో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. సానియాతో పెళ్లి సానియా, షోయబ్ 2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ పుట్టాడు. -
'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు'
టీ20 ప్రపంచకప్-2022కు పాకిస్తాన్ జట్టును పీసీబీ గురువారం ప్రకటించింది. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదితో పాటు బ్యాటర్లు షాన్ మసూద్, హైదర్ అలీ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే మరో సారి వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కు మాలిక్‌ను ఎంపిక చేయకపోవడాన్ని పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. మాలిక్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాల్సిందని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సమా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ.. "మాలిక్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అదే విధంగా అతడు ఆడిన ప్రతీ చోట అద్భుతంగా రాణించాడు. మాలిక్ 40 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా ఉన్నాడు. అతడికి మిడిలార్డర్లో తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మార్చగల సత్తా ఉంది. మాలిక్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది. మాలిక్ జట్టులో ఉండి ఉంటే.. కెప్టెన్ బాబర్ ఆజాంకు కూడా అతడి నుంచి ఫీల్డ్‌లో సపోర్ట్ ఉండేది"పేర్కొన్నాడు. కాగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు మాలిక్‌ను సెలెక్టర్లు ఎంపికచేయడం లేదు. అతడు చివరి సారిగా పాక్ తరపున గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. చదవండి: T20 WC: షాహిన్ విషయంలో ఆఫ్రిది చెప్పింది నిజమే అయితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు! అతడు.. -
షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన హర్భజన్ సింగ్
Shoaib Akhtars mothers demise: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్తర్ తల్లి అనారోగ్యంతో ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్ వేదికగా తెలిపాడు. పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రకారం.. షోయబ్ తల్లి ఆరోగ్యం క్షీణిచడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందూతూ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి. కాగా అక్తర్ తల్లి మృతికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్‌తో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు. "ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని హర్భజన్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: Vijay Hazare Trophy Final: అర్ధ సెంచరీతో మెరిసిన దినేష్ కార్తీక్.. -
Ban vs Pak 2021: బంగ్లాదేశ్తొ తొలి టీ20.. పాకిస్తాన్ జట్టు ఇదే!
Ban vs Pak: Pakistan Announce 12 Man Squad For 1st T20I Against Bangladesh: టీ20 ప్రపంచకప్-2021 సూపర్ 12 రౌండ్లో అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ ఫైనల్ చేరలేక చతికిల పడింది పాకిస్తాన్. అయితే, టోర్నీ ముగిసిన వెంటనే.. బంగ్లాదేశ్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నేపథ్యంలో బంగ్లాదేశ్ చేరుకున్న బాబర్ ఆజమ్ బృందం మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో నవంబరు 19న జరుగనున్న తొలి మ్యాచ్ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. దాదాపు ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లందరికీ చోటు దక్కగా.. కొత్తగా హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్లను ఎంపిక చేశారు. బంగ్లాదేశ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌కు పాకిస్తాన్ ప్రకటించిన జట్టు ఇదే: బాబర్ ఆజమ్(కెప్టెన్), షాబాద్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫఖార్ జమాన్, హైదర్ అలీ, షోయబ్ మాలిక్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, హారీస్ రవూఫ్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటన- షెడ్యూల్ ఇదే: తొలి టీ20- నవంబరు 19- ఢాకా రెండో టీ20- నవంబరు 20- ఢాకా మూడో టీ20- నవంబరు 22- ఢాకా రెండు టెస్టులు: మొదటి టెస్టు: నవంబరు 26- 30- చిట్టాగ్రామ్ రెండో టెస్టు: డిసెంబరు 4- 8- ఢాకా చదవండి: Deepak Chahar: అక్కా తను ఎక్కడ ఉంది... వీడియో వైరల్.. పాపం దీపక్.. మ్యాచ్ జరుగుతుండగానే! Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు! -
Shoaib Malik: ఆఫ్రిదికి సెల్యూట్ చేసిన మాలిక్.. ఎందుకో తెలుసా..!
Shoaib Malik salutes Shahid Afridi: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా శుక్రవారం ఆప్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమిఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తమ జట్టును సపోర్ట్ చేయడానికి వచ్చిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదినూ చూస్తూ.. షోయబ్ మాలిక్ సెల్యూట్ చేశాడు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ఆఫ్రిది.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే రిజ్వాన్ (8) వికెట్‌ను కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే తక్కువ వ్యవధిలో ఫఖర్‌తో పాటు హఫీజ్ (10) కూడా నిష్క్రమించాడు. బాబర్‌ను రషీద్ అవుట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్ ఉల్ హఖ్ 2 పరుగులే ఇచ్చి మాలిక్ (19) వికెట్ తీయడంతో అఫ్గాన్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ఆసిఫ్ తన మెరుపు బ్యాటింగ్‌తో పాక్‌ను గెలిపించాడు. చదవండి: Sarah Taylor: క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Moment of the Day Shoaib Malik comes and Salute to Superstar Shahid Afridi Malik: mere murshad #PakvsAfg #T20WorldCup21 pic.twitter.com/PNOYw10eXW — Malik A Haseeb🇵🇰 (@MalikAHaseeb) October 29, 2021 -
IND Vs PAK: అందుకే జట్టులో మాలిక్‌కు చోటు.. అసలు కారణం చెప్పిన పాక్ కెప్టెన్
Babar Azam goes in with Shoaib Malik ahead of Sarfaraz Ahmed: టి20 ప్రపంచ కప్ 2021లో దాయాదుల ధూమ్ ధామ్‌కు రంగం సిద్దంమైంది. నేడు (అక్టోబరు 24)న దుబాయ్ వేదికగా సాయంత్రం 7: 30 గంటలకు భారత్- పాక్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్‌తో తలపడే జట్టును పాకిస్తాన్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ అనుహ్యంగా చోటు దక్కింది. అయితే తుది జట్టులో సర్ఫరాజ్ అహ్మద్‌కు చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ .. మాలిక్‌కు చోటు దక్కడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజాం స్పందించాడు. టీమిండియాతో మ్యాచ్‌కు సర్ఫరాజ్ అహ్మద్‌ని తుది జట్టులో తీసుకుందామని మెదట భావించాము. కానీ అతడి స్ధానంలో అఖరికి మాలిక్‌ను మేనేజెమెంట్ ఎంపిక చేసింది అని బాబర్ తెలిపాడు. "సర్ఫరాజ్ స్పిన్ బౌలింగ్‌కు బాగా ఆడగలడు. ఆతడు భారత్‌పై ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగలడు. అయితే ఈ మ్యాచ్‌లో మేము అత్యత్తుమ జట్టుతో బరిలోకి దిగాలి అనుకున్నాము. స్పిన్ని షోయబ్ మాలిక్ కూడా బాగా ఆడగలడు. కొన్ని సమయాల్లో మాకు పార్ట్‌టైమ్ బౌలర్‌గాను మాలిక్ ఊపయోగపడతాడు. అందుకే మేము సర్ఫరాజ్ స్ధానంలో మాలిక్‌ని ఎంపిక చేశామని"బాబర్ విలేకరుల సమావేశంలో తెలిపాడు. చదవండి: T20 World Cup 2021 Ind vs Pak: ఆ ముగ్గురి పేరు మీదే ఎక్కువ బెట్టింగ్‌లు! -
నేను తల్లి కాబోతున్నా: సానియా
హైదరాబాద్ : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లి కాబోతున్నారు. త్వరలోనే తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతుందని సానియానే ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. బెబీ మీర్జా మాలిక్ అనే హ్యాష్ ట్యాగ్‌తో తాను గర్భం దాల్చిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ పోస్టుకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇక సానియా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో సానియా మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజు మా కుటుంబ రహస్యం చెప్పాలనుకుంటున్నా. మాకు సంతానం ఎప్పుడు కలిగినా వారి పేర్లలో మా ఇంటి పేర్లు వచ్చేలా ‘మీర్జా మాలిక్’ను జోడించాలని నేను, మా ఆయన నిర్ణయించుకున్నాం. నిజానికి షోయబ్ కూడా అమ్మాయే కావాలని ఆశిస్తున్నాడు’ అని తెలిపారు. #BabyMirzaMalik 👶🏽❤️ pic.twitter.com/RTYpqok1Vl — Sania Mirza (@MirzaSania) 23 April 2018 -
భర్తకు మద్దతిస్తా... భారత్‌కూ జై కొడతా
బర్మింగ్‌హామ్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ సమరంలో భర్త షోయబ్ మాలిక్ (పాక్ క్రికెటర్)కు మద్దతిస్తానని... అదే సమయంలో స్వదేశానికి జై కొడతానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. ప్రస్తుతం వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నద్ధమవుతున్న ఆమె.. తనను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలు బాధాకరమని చెప్పింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు ఆమె ఇరుజట్లకు శుభాకాంక్షలు తెలిపింది. దీనిపై భారత నెటిజన్లు మండిపడ్డారు. ఆమె 60 లక్షల ఫాలోయర్స్‌లో కొందరు విమర్శలతో ట్వీట్స్ చేశారు. దీనిపై డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సానియా స్పందిస్తూ ‘అలాంటి విమర్శల్ని నేను పట్టించుకోను. బయటెక్కడో కూర్చుని తమకిష్టమొచ్చినట్లు అనడం సులభమే. అదృష్టం కొద్దీ అలాంటి విమర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు. అదేంటో ఏమో నేనంటే ఏమాత్రం తెలియనివాళ్లు కూడా విపరీతంగా స్పందించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నిజానికి 80 శాతం మంది నన్ను మంచిగానే అర్థం చేసుకుంటే, కేవలం 20 శాతం మందే ప్రతిదానికీ పెడర్థాలు తీస్తారు. కానీ మెజారిటీ ప్రజలు నన్ను బాగానే రిసీవ్ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది. ఆటను ఆటగానే చూడాలి ఇండో, పాక్‌ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరుగుతున్నా తనకు ఇలాంటి ఇబ్బందులు తప్పట్లేదని ఆమె చెప్పింది. మన దేశంతో ఆడుతున్నపుడు ప్రత్యర్థి జట్టులో ఉన్న భర్తను తాను శత్రువుగా చూడాలనుకోవడం తగదని ఆమె హితవు పలికింది. ‘ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఇది కేవలం క్రీడ. ప్రతి అథ్లెట్ ఆటను ఆటగానే చూడాలనుకుంటాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడితే అది ఆటలో భాగమే.. కానీ అదేమీ యుద్ధం కాదు. జీవన్మరణ పోరు అంతకన్నా కాదు’ అని సానియా వివరించింది. క్రీడాస్ఫూర్తి అంటే అదే.. దాయాది ఆటగాళ్లు కేవలం మైదానంలోనే ప్రత్యర్థులని చెప్పింది. ‘ఫైనల్ మ్యాచ్ ముగిశాక తన భర్త షోయబ్ మాలిక్, భారత ఆటగాళ్లు కోహ్లి, యువరాజ్‌లతో సరదాగా మాట్లాడుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి ముందు ఓ పది నిమిషాల పాటు ఇది సాగింది. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే. మైదానంలోనే ప్రత్యర్థులు. అది ముగిశాక అందరు స్నేహితులే. నిజానికి ఇరు దేశాల ప్రజలు మాట్లాడే భాష, తినే తిండి ఒకలాగే ఉంటుంది. సంస్కృతి కూడా ఒకలాగే అనిపిస్తుంది. కానీ ఇదేది విమర్శకులకు పట్టదు. బహుశా ఎలాంటి ఆట ఆడకపోవడం వల్లేనేమో!’ అని సానియా చురక వేసింది స్థిరమైన భాగస్వామి లేకపోతే... గత ఆగస్టు దాకా మార్టినా హింగిస్‌తో కలిసి పలు టైటిల్స్ నెగ్గిన ఆమె గత సీజన్‌ను నంబర్‌వన్ (డబుల్స్‌లో)తో ముగించింది. కానీ ఇటీవల తరచూ డబుల్స్ భాగస్వామిని మార్చడం పెద్ద సమస్యని పేర్కొంది. గత ఆగస్టు తర్వాత స్ట్రికోవాతో జతకట్టిన ఆమె... తదనంతరం ష్వెదోవాతో కలిసి ఆడింది. అయితే గాయం కారణంగా ష్వెదోవా కొన్ని వారాలపాటు ఆటకు దూరమైంది. ఈ నేపథ్యంలో వింబుల్డన్ సన్నాహక టోర్నీలో కొకొ వాండెవెగె (అమెరికా)తో సానియా బరిలోకి దిగింది. తాజాగా 48వ ర్యాంకర్ కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం)తో కలిసి వింబుల్డన్ టోర్నీలో ఆడనుంది. -
ఓ ఆప్ నేతా.. ఇదేం కవితా?
సానియా మీర్జా వివాహంపై కుమార్ విశ్వాస్ కుళ్లు జోకులు న్యూఢిల్లీ: ‘మనిషన్నాక.. కాసింత కళా పోసన ఉండాల’ అన్న డైలాగును ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ బాగానే ఒంట బట్టించుకున్నట్టున్నారు! కానీ అదే ఇప్పుడు ఆయనకు, పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. కళా పోషణను ‘కాసింత’ కాదు.. కాస్త ‘ఎక్కువగా’ ఒంట బట్టించుకోవడమే ఇందుకు కారణం!! తన కవితాత్మక భావాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికే పలు అంశాలపై దుమారం సృష్టించి తర్వాత లెంపలేసుకున్న ఈయన.. ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాదీ, ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహానికి సంబంధించి విశ్వాస్ గతంలో ఓ కవి సమ్మేళనంలో చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్క ర్లు కొడుతోంది. అందులో ఆయన షోయబ్‌ను ‘మగతనం’ లేనివాడు అన్న భావన వచ్చేలా మాట్లాడారు. ‘‘సానియా పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. తన క్రీడారంగంలో ఇక ముందుకు వెళ్లలేనని భావించి వేరే రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె ఓ ‘హిట్టర్’ను పెళ్లాడాలనుకుంటే ఎవరైనా భారతీయుడిని చేసుకోవాల్సింది. కానీ పాకిస్థాన్ ఎందుకు వెళ్లింది?’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆ కార్యక్రమంలో ఉన్నవారంతా గొల్లున నవ్వారు.