
PC: PCB Twitter
బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ టీ20 సిరీస్.. మొదటి మ్యాచ్‌కు పాక్ జట్టు ఇదే!
Ban vs Pak: Pakistan Announce 12 Man Squad For 1st T20I Against Bangladesh: టీ20 ప్రపంచకప్-2021 సూపర్ 12 రౌండ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ ఫైనల్ చేరలేక చతికిల పడింది పాకిస్తాన్. అయితే, టోర్నీ ముగిసిన వెంటనే.. బంగ్లాదేశ్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నేపథ్యంలో బంగ్లాదేశ్ చేరుకున్న బాబర్ ఆజమ్ బృందం మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ నేపథ్యంలో నవంబరు 19న జరుగనున్న తొలి మ్యాచ్ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. దాదాపు ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లందరికీ చోటు దక్కగా.. కొత్తగా హైదర్ అలీ, ఖుష్‌దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్‌లను ఎంపిక చేశారు.
బంగ్లాదేశ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌కు పాకిస్తాన్ ప్రకటించిన జట్టు ఇదే:
బాబర్ ఆజమ్(కెప్టెన్), షాబాద్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫఖార్ జమాన్, హైదర్ అలీ, షోయబ్ మాలిక్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, హారీస్ రవూఫ్.
పాకిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటన- షెడ్యూల్ ఇదే:
- తొలి టీ20- నవంబరు 19- ఢాకా
- రెండో టీ20- నవంబరు 20- ఢాకా
- మూడో టీ20- నవంబరు 22- ఢాకా
రెండు టెస్టులు:
- మొదటి టెస్టు: నవంబరు 26- 30- చిట్టాగ్రామ్
- రెండో టెస్టు: డిసెంబరు 4- 8- ఢాకా
చదవండి: Deepak Chahar: అక్కా తను ఎక్కడ ఉంది... వీడియో వైరల్.. పాపం దీపక్.. మ్యాచ్ జరుగుతుండగానే!
Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు!