స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక జట్టు ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. గాలే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (122) సూపర్ సెంచరీతో మెరవగా.. ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీతో రాణించాడు. వీరు మినహా మిగతా వారెవ్వరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు లంచ్ సమయానికి లంక ఇన్నింగ్స్ ముగిసింది.
10వ సెంచరీ పూర్తి చేసిన ధనంజయ..
కష్ట సమయంలో (54/4) క్రీజ్‌లోకి వచ్చిన ధనంజయ బాధ్యతాయుతంగా ఆడి, జట్టు స్కోర్ 300 దాటించడంతో పాటు కెరీర్‌లో 10వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్‌తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ధనంజయ, టెయిలెండర్లతో కలిసి మరిన్ని పరుగులు జోడించాడు. 31 ఏళ్ల ధనంజయకు పాక్‌పై ఇది మూడో సెంచరీ కాగా.. తన 50వ టెస్ట్ మ్యాచ్‌లో అతను సెంచరీ చేయడం విశేషం. కెరీర్‌తో 88 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన ధనంజయ.. 10 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3152 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment