PAK VS NZ 2nd ODI: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) విరుచుకుపడ్డాడు. అతనికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) తోడవ్వడంతో న్యూజిలాండ్ 261 పరుగులు చేసి ఆలౌటైంది (49.5 ఓవర్లలో). వీరిద్దరూ రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 181 పరుగులు జోడించడంతో ఓ దశలో పర్యాటక జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడం, సాంట్నర్ (37) మినహా జట్టులో మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో న్యూజిలాండ్ నామమాత్రపు స్కోర్‌కే ఆలౌటైంది.
పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. నసీం షా 3, హరీస్ రౌఫ్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్‌ల్లో పాక్ ఓటమి అంచుల దాకా వచ్చి డ్రాతో గట్టెక్కింది. అంతకుముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-3 తేడాతో కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment