కరాచీ: పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ విజయంపై న్యూజిలాండ్ గురి పెట్టింది. మూడున్నర రోజుల పాటు చప్పగా సాగిన రెండో టెస్టు గురువారం చివర్లో ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. 319 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాక్ ఆట ముగిసే సమయానికి 2.5 ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది.
అబ్దుల్లా షఫీక్ (0), నైట్‌వాచ్‌మన్ మీర్ హమ్జా (0) బౌల్డ్ కాగా, ఇమామ్ ఉల్ హక్ (0 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. బంతి ఇప్పటికే అనూహ్యంగా స్పందిస్తుండగా చివరి రోజు పాక్ విజయాన్ని అందుకోవడం అంత సులువు కాదు! అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై పాక్ 41 పరుగుల ఆధిక్యం కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్ 5 వికెట్లకు 277 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్రేస్‌వెల్ (74 నాటౌట్), బ్లన్‌డెల్ (74), లాథమ్ (62) అర్ధ సెంచరీలు చేశారు.
కాగా, ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను పాకిస్తాన్ 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఒకవేళ న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ పాక్ ఓటమిపాలైతే స్వదేశంలో పాక్‌కు ఇది వరుసగా రెండో పరాభవం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment