
రామ్‌నరేశ్ శర్వాన్(PC: AFP)
వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రామ్‌నరేశ్ శర్వాన్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. జాతీయ సెలక్టర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
ఈ మేరకు.. ‘‘పురుషుల సీనియర్, యువ విభాగానికి క్రికెట్ సెలక్టర్‌గా ఉన్న రామ్‌నరేశ్ శర్వాన్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలిగారు. జనవరి 6, 2022లో ఆయన నియామకం జరిగింది. అయితే, ఇకపై ఆయన ఈ పదవిలో కొనసాగరని క్రికెట్ వెస్టిండీస్ తెలియజేస్తోంది’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా రామ్‌నరేశ్ స్థానంలో మెన్స్ యూత్ సెలక్షన్ మెంబర్ రాబర్ట్ హెయిన్స్ జాతీయ సెలక్టర్‌గా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టు.. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మే 31న ఇది ఆరంభం కానుంది. ఆ తర్వాత వెస్టిండీస్ జూన్ 9 నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. పాక్‌లోని ముల్తాన్ వేదికగా ఈ సిరీస్ జరుగనుంది.
చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్‌లో మోస్ట్ లక్కీ ప్లేయర్..!