నెదర్లాండ్స్ క్రికెటర్ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ ఓటమి తర్వాత సిబ్రాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో 1988లొ జన్మించిన సిబ్రాండ్.. అక్కడే క్రికెటర్‌గా మారాడు.
విరాట్ కోహ్లి క్యాచ్ అందుకుని
అండర్-19 ప్రపంచకప్-2008లో సౌతాఫ్రికా తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. నాడు యువ భారత్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు.
జాంటీ రోడ్స్ మాదిరి క్యాచ్ పట్టాడంటూ అప్పట్లో సిబ్రాండ్‌పై ప్రశంసలు కురిశాయి. ఇక తర్వాత సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో కేప్ కోబ్రాస్(2008/09, 2015/16), వెస్టర్న్ ప్రావిన్స్(2009/10 to 2016/17) జట్లకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాడు.
చాంపియన్స్-2014 లీగ్‌లో భాగంగా కోబ్రాస్ తరఫున.. జేపీ డుమిన్ స్థానంలో బరిలోకి దిగి.. సూపర్ ఓవర్‌లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అయితే, ఆ తర్వాత ఉన్నత విద్యనభ్యసించడంపై దృష్టి పెట్టిన సిబ్రాండ్ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు.
ఉద్యోగం కోసం అక్కడికి
ఎంబీఏ చేసేందుకు ఆటను పక్కనపెట్టి.. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో ఉద్యోగ విధుల నిమిత్తం 2021లో నెదర్లాండ్స్‌కు మకాం మార్చాడు. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడిన సిబ్రాండ్.. డచ్ టాప్‌క్లాసెస్ చాంపియన్‌షిప్-2023లో వూబర్గ్ సీసీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ నేపథ్యంలో 2023లో వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2024లో టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన సిబ్రాండ్.. ప్రపంచకప్-2024 జట్టులోనూ భాగమయ్యాడు.
ఇక ఇప్పటి వరకు మొత్తంగా డచ్ జట్టు తరఫున 12 వన్డేలు, 12లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఆయా ఫార్మాట్లలో 385, 280 పరుగులు చేశాడు. ఇక రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన 35 ఏళ్ల సిబ్రాండ్ టీ20లలో 5 వికెట్లు కూడా పడగొట్టాడు.
టీ20 వరల్డ్‌కప్-2024 - గ్రూప్-డి శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్
👉వేదిక: సెయింట్ లూసియా, వెస్టిండీస్
👉టాస్: నెదర్లాండ్స్.. తొలుత బౌలింగ్
👉శ్రీలంక స్కోరు: 201/6 (20)
👉నెదర్లాండ్స్ స్కోరు: 118 (16.4)
👉ఫలితం: 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన శ్రీలంక
👉ఈ మ్యాచ్‌లో సిబ్రాండ్ చేసిన పరుగులు: 11.
Comments
Please login to add a commentAdd a comment