national selection committee
-
పాక్‌తో సిరీస్‌కు ముందు విండీస్‌కు ఎదురుదెబ్బ..!
వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రామ్‌నరేశ్ శర్వాన్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. జాతీయ సెలక్టర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘పురుషుల సీనియర్, యువ విభాగానికి క్రికెట్ సెలక్టర్‌గా ఉన్న రామ్‌నరేశ్ శర్వాన్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలిగారు. జనవరి 6, 2022లో ఆయన నియామకం జరిగింది. అయితే, ఇకపై ఆయన ఈ పదవిలో కొనసాగరని క్రికెట్ వెస్టిండీస్ తెలియజేస్తోంది’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా రామ్‌నరేశ్ స్థానంలో మెన్స్ యూత్ సెలక్షన్ మెంబర్ రాబర్ట్ హెయిన్స్ జాతీయ సెలక్టర్‌గా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టు.. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మే 31న ఇది ఆరంభం కానుంది. ఆ తర్వాత వెస్టిండీస్ జూన్ 9 నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. పాక్‌లోని ముల్తాన్ వేదికగా ఈ సిరీస్ జరుగనుంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! -
విరాట్ కోహ్లి ఈజ్ బ్యాక్!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జాతీయ సెలెక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. ఇక బ్రిస్బేన్ టెస్టులో అదరగొట్టిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. దాంతోపాటు స్టాండ్ బై వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ అవకాశం లభించింది. నాలుగు గెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు చెన్నైలో ప్రారంభమవుతుంది. తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇది... భారత జట్టు: విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. (చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం) -
ధోని సరైన నిర్ణయం తీసుకున్నాడు
స్వాగతించిన ఎమ్మెస్కే ప్రసాద్ ముంబై: భారత వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోని నిర్ణయాన్ని జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్వాగతించారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని సరైన నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. ఇంగ్లండ్‌తో ఈ నెల 15 నుంచి జరగబోయే వన్డే, టి20 సిరీస్‌కు ధోని పేరును పరిశీలిస్తామని ఆయన సూత్రప్రాయంగా చెప్పారు. ‘ధోని ఈ నిర్ణయం ఏడాది, ఆరు నెలల కిందట తీసుకుని ఉంటే నేను కాస్త ఆందోళన చెందేవాడిని. కానీ ఇప్పుడు సరైన సమయంలో అతను తప్పుకున్నాడు. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా తన సేవలను మరికొన్ని సంవత్సరాలు అందిస్తాడనే నమ్మకం నాకుంది. జట్టు నిర్మాణంలో అతని పాత్ర వెలకట్టలేనిది’ అని ప్రసాద్ ప్రశంసించారు. కెప్టెన్‌గా వన్డే వరల్డ్ కప్, టి20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీలను సాధించిన ఘనత భవిష్యత్తులో మరెవ్వరికీ సాధ్యం కాదని, ఇకపై నాయకుడిగా అతను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు. ధోని జట్టులో ఉండటం కోహ్లికి ఎంతో మేలు చేస్తుందని, తన ఆలోచనలను కోహ్లితో పంచుకుంటే జట్టుకు ప్రయోజనం చేకూరుతుందన్న ఎమ్మెస్కే... మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ భారం దిగిపోవడం వల్ల అతను స్వేచ్ఛగా ఆడగలుగుతాడని అన్నారు.