వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఘోర పరాజయాలు ఎదుర్కొని, తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో క్రికెట్ సర్కిల్స్‌లో ప్రపంచకప్ అర్హతలకు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రపంచకప్ అంటే పేరుకు తగ్గట్టుగా కనీసం 16 దేశాలతో పోటీలు నిర్వహించాలని, అలా కాకుండా 4 ఏళ్లకు ఓ సారి జరిగే మెగా టోర్నీని 10 జట్లకే పరిమితం చేసి, విండీస్‌లా మేలైన జట్లకు అన్యాయం చేయడం సమంజసం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ మైబుర్గ్ సైతం చెప్పుకొచ్చాడు.
వాస్తవ విషయం ఏంటంటే.. పరిమిత జట్లతో ప్రపంచకప్ నిర్వహించడం వల్ల క్రికెట్ చచ్చిపోతుంది. ప్రపంచకప్ పేరుకు తగ్గట్టుగా ప్రపంచం నలుమూలల నుంచి జట్లకు ప్రాతినిధ్యం లభించాలి. మెగా టోర్నీలో కనీసం 16 జట్లైనా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. అన్ని క్రీడల మెగా టోర్నీల్లో జట్ల సంఖ్య పెరుగుతుంటే క్రికెట్‌లో మాత్రం జట్లను తగ్గించుకుంటూ వస్తున్నారు. వెస్టిండీస్ లాంటి జట్టు వరల్డ్‌కప్ ఆడటం లేదన్న విషయం తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ స్టీఫెన్ మైబుర్గ్ అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Spare your thoughts on 10 teams at the ODI World Cup main event✍️
— CricTracker (@Cricketracker) July 3, 2023
📸: ICC#ICCWorldCupQualifier #WestIndies pic.twitter.com/WRAaBfXQJI
కాగా, ప్రస్తుతానికి (జులై 3) వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. రేపు ఈ ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో రెండో బెర్త్‌పై కూడా దాదాపుగా క్లారిటీ రానుంది. సూపర్ సిక్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు క్వాలిఫయర్స్ ఫైనల్‌కు చేరడంతో పాటు ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ సహా 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇటీవలే వరల్డ్‌కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment