ఇస్లామాబాద్: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా పాక్ సిరీస్‌ను పూర్తిగా రద్దు చేసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రావల్పిండి వేదికగా నేటినుంచి తొలి వన్డే ఆడాల్సి ఉండగా.. చివరి నిమిషంలో టూర్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
న్యూజిలాండ్ ప్రభుత్వం పాక్‌లో తమ ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా తీవ్ర స్ధాయిలో ఆందోళన చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తెలిపారు. కాగా… పాక్ –న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తరువాత న్యూజిలాండ్ తొలిసారిగా పాక్ పర్యటనకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment