ప్రముఖ వాహన తయారీ కంపెనీ జావా మోటార్ సైకిల్స్ 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా జావా బ్రాండ్‌లో ఖాకీ, మిడ్‌నైట్ గ్రే రంగులను పరిచయం చేసింది. భారత్‌లో సైనిక చిహ్నంతో మోటార్ సైకిల్స్ అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. "50 సంవత్సరాల క్రితం భారత సాయుధ దళాలు దురాక్రమణకు అడ్డుగా నిలిచాయి. చరిత్రలో జరిగిన అతి తక్కువ గొప్ప యుద్ధాలలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. 1971 వార్ విక్టరీ 50 సంవత్సరాలను పురస్కరించుకొని #SwarnimVijayVarsh జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది" అని జావా మోటార్ సైకిల్స్ ట్విట్టర్ లో తెలిపింది.
మాతృ భూమిని రక్షించడానికి సైనికులు చూపిన ధైర్యం, త్యాగాలను ఈ బైక్ పై ఉన్న భారత సైనిక చిహ్నం గుర్తు చేస్తుందని వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా జావా బృందాన్ని అభినందించారు ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.1.96 లక్షలుగా ఉంది. కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ ద్వారా స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment