Pc: Inside sport
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇక పుణే,లక్నో రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ సీజన్‌కు సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది. అయితే ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు 26 మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏఏ ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారో పరిశీలిద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంట్లో చాలా మంది విదేశీ ఆటగాళ్లే. వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్‌లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఇక దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ సిరీస్ కారణంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్,లుంగి ఎంగిడి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. అదే విధంగా ప్రోటీస్ స్టార్ పేసర్ నార్ట్జే గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. లక్నో కూడా వేలంలో విదేశీ స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్,క్వింటన్ డి కాక్ వంటి విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో గాయపడిన మార్క్ వుడ్ అందుబాటులో ఉండటం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల తర్వాతే మార్కస్ స్టోయినిస్ లక్నో జట్టులోకి రానున్నాడు.
పంజాబ్ కింగ్స్
అంతర్జాతీయ సిరీస్‌ల కారణంగా జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్ ఐపీఎల్- 2022లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ముఖ్యంగా స్టార్ పేసర్ రబడా ఒకటి నుంచి ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్- 2022 ఆరంభ మ్యాచ్‌ల్లో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సేవలను ఆర్సీబీ కోల్పోతుంది. గ్లెన్ మాక్స్‌వెల్,హాజిల్‌వుడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ దూరం కానున్నారు.
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసింది.
గుజరాత్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దూరం కానున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లో డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా జట్టులో భాగమై ఉండగా, అల్జారీ జోసెఫ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ తరపున ఆడుతున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్
కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కో జాన్‌సెన్, ఐడెన్ మార్క్‌రామ్ సేవలను కోల్పోనుంది. అదే విధంగా ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ కూడా దూరం కానున్నాడు.
రాజస్థాన్ రాయల్స్
ఆరంభ మ్యాచ్‌లకు ప్రోటీస్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ దూరం కానున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో డస్సెన్ భాగమై ఉన్నాడు. ఒక వేళ టెస్ట్ సిరీస్‌కు ఎంపికైతే అతడు ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్
గత ఏడాది ఫైనలిస్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్ లేకుండానే ఆరంభ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. పాకిస్థాన్‌తో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత కమ్మిన్స్ జట్టులో చేరే అవకాశం ఉన్నప్పటికీ, ఫించ్ మాత్రం వైట్ బాల్ సిరీస్‌లో భాగమై ఉన్నాడు.
ముంబై ఇండియన్స్
గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కానున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో ఆడేందుకు పూర్తి స్థాయి జట్టును కలిగి ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్
ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ దూరం కానున్నాడు.బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతడు ప్రోటీస్ జట్టులో భాగమై ఉన్నాడు.
చదవండి: IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! అయితే..
Comments
Please login to add a commentAdd a comment