సౌతాఫ్రికా-పాకిస్తాన్ జట్ల మధ్య చెన్నై వేదికగా ఇవాళ (అక్టోబర్ 27) కీలక సమరం జరుగనుంది. ప్రస్తుత ఎడిషన్‌లో హ్రాటిక్ పరాజయాలు, చివరి మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. మరోవైపు సౌతాఫ్రికా ఈ టోర్నీలో భారీ విజయాలతో దూసుకుపోతూ, పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్స్ చేతిలో ఊహించని షాక్ మినహాయించి, ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికా పరిస్థితి పాక్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట భారీ విజయాలు సాధించి, భారత్ కంటే మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది.
పాక్‌దే పైచేయి..
వన్డే ప్రపంచకప్‌లో పాక్-సౌతాఫ్రికాల మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు జరగ్గా.. సౌతాఫ్రికా మూడు, పాక్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
ఈ శతాబ్దంలో ఒక్కటీ గెలవలేదు..
పాక్-సౌతాఫ్రికాల మధ్య వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ల మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఈ శతాబ్దంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. 2009 టీ20 వరల్డ్‌కప్‌లో మొదలైన పాక్ జైత్రయాత్ర 2022 టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగింది. పాక్.. 2009, 2010, 2012, 2022 టీ20 వరల్డ్‌కప్‌ల్లో.. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌ల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లోనైనా సౌతాఫ్రికా.. పాక్‌ను ఓడిస్తుందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment