
Babar Azam fully confident of defeating India: టి20 ప్రపంచ్‌కప్ 2021లో దాయాదుల సమరానికి సమయం దగ్గర పడింది. ఆక్టోబర్ 24న పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడనుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కీలక వాఖ్యలు చేశాడు. టీమిండియాపై విజయం సాధించి టి20 ప్రపంచ్ కప్‌లో శుభారంభం చేయనున్నట్లు అజమ్ తెలిపాడు. ఇటీవల కాలంలో యుఏఈలో అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం తమకు కావలసిన ప్రయోజనాన్ని అందిస్తుందని బాబర్ అజమ్ అభిప్రాయపడ్డాడు.
"ప్రతి మ్యాచ్ ఒత్తిడి మాకు తెలుసు. ముఖ్యంగా మొదటి మ్యాచ్ ఇది. మేము మ్యాచ్ గెలిచి ముందుకు వెళ్తాము. మేము గత 3-4 సంవత్సరాలుగా యుఏఈలో క్రికెట్ ఆడుతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. వికెట్ ఎలా ఉంటుందో.. దానికి తగ్గట్టు ఏ బ్యాటర్‌ని ఏ స్ధానంలో పంపాలనేదానిపై ఒక అంచనా ఉంది. ఎవరైతే బాగా ఆడుతారో, వారే మ్యాచ్‌లో గెలుస్తారు. మీరు నన్ను అడిగారు.. కచ్చితంగా మేమే గెలుస్తాము ”అని బాబర్ ఓ పాక్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
"ఒక జట్టుగా మా విశ్వాసం, ధైర్యం చాలా ఎక్కువ. మేము గతం గురించి కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము. మేము భారత్‌పై విజయం కోసం సిద్ధమవుతున్నాము. భారత్‌తో బాగా ఆడతామని నాకు పూర్తి నమ్మకం ఉంది ”అని బాబర్ తెలిపాడు. కాగా పాకిస్తాన్ ఇప్పటి వరకు వన్డే, టి20 ప్రపంచకప్‌లలో భారత్‌పై ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు.
చదవండి: ఒక్కరు కాదు ముగ్గురు క్యాచ్ పట్టారు.. ఊహించని ట్విస్ట్