చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు తిలక్ వర్మ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య చేధనలో క్రమం తప్ప వికెట్లు పడినప్పటికి తిలక్ మాత్రం తన విరోచిత పోరాటం కనబరిచాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.
తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 166 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు.
తద్వారా టీ20ల్లో రెండు డిస్మిసల్స్(ఔట్‌లు) మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తిలక్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్‌మన్ పేరిట ఉండేది. చాప్‌మాన్ టీ20ల్లో రెండు ఔట్‌ల మధ్య 271 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో చాప్‌మన్ రికార్డును ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు.
టీ20ల్లో రెండు ఔట్‌ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
318 తిలక్ వర్మ (107*, 120*, 19*, 72*)
271 మార్క్ చాప్‌మన్ (65*, 16*, 71*, 104*, 15)
240 ఆరోన్ ఫించ్ (68*, 172)
240 శ్రేయాస్ అయ్యర్ (57*, 74*, 73*, 36)
239 డేవిడ్ వార్నర్ (100*, 60*, 57*, 2*, 20)
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడగా ఆడారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్‌కోట్‌లో జరగనుంది.
చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్
Comments
Please login to add a commentAdd a comment