Update: స్కాట్లాండ్‌పై ఘన విజయంతో భారత్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుంది. టీమిండియా రన్‌రేట్ +1.619కు చేరింది. దీంతో గ్రూపు2లో భారత్ మూడో స్ధానానికి చేరుకుంది. ముందుగా అంచనా వేసినట్లుగా 7.1 ఓవర్లకు బదులు 6.3 ఓవర్లలోనే 86 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
స్కోర్లు:
స్కాట్లాండ్- 85 (17.4)
టీమిండియా- 89/2 (6.3)
Team India Will Cross Afghanistan Net Run Rate If Target Is Chased In 7.1 Overs: టీ20 ప్రపంచకప్-2021 గ్రూప్-2లో సమీకరణలు మ్యాచ్ మ్యాచ్‌కి మారుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్ ఇదివరకే సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, భారత్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇవాళ భారత్, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 85 పరుగులకే కుప్పకూలింది.
ఈ నేపథ్యంలో సరికొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్ధేశించిన 86 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 11.2 ఓవర్లలో ఛేదిస్తే నెట్ రన్‌రేట్ +1.000కి చేరుతుంది. అదే 8.5 ఓవర్లలో ఛేదిస్తే.. న్యూజిలాండ్ రన్‌రేట్(+1.277)ను క్రాస్ చేస్తుంది. 86 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 7.1 ఓవర్లలో ఛేదించగలిగితే అఫ్గనిస్థాన్ రన్‌రేట్(+1.481)ను దాటి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉంది.
చదవండి: T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
Comments
Please login to add a commentAdd a comment